జలమయమైన మోదీ స్టేడియం... బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధించిన టీఎంసీ
- ఐపీఎల్ ఫైనల్ కు ఆతిథ్యమిచ్చిన మోదీ స్టేడియం
- వర్షం కారణంగా జలమయం
- అబద్ధాల బీజేపీ అంటూ టీఎంసీ వ్యాఖ్యలు
- నాడు అమిత్ షా గొప్పలు చెప్పారని, ఇప్పుడు డొల్లతనం బయటపడిందని వెల్లడి
ఐపీఎల్ ఫైనల్ సందర్భంగా అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వర్షం కారణంగా జలమయమైంది. అయితే, దీనిపై తృణమూల్ కాంగ్రెస్ రాజకీయపరమైన విమర్శలు చేసింది. 2021లో ఈ స్టేడియం ప్రారంభోత్సవం సందర్భంగా అమిత్ షా చేసిన వ్యాఖ్యల క్లిప్పింగ్ ను టీఎంసీ సోషల్ మీడియాలో పంచుకుంది.
ప్రపంచంలో ఇంతకంటే గొప్ప స్టేడియం మరొకటి లేదని అమిత్ షా గొప్పలు చెప్పుకున్నారని, కానీ మొన్న కురిసిన వర్షంతో మోదీ స్టేడియం డొల్లతనం బట్టబయలైందని టీఎంసీ విమర్శించింది. మైదానంలో నీళ్లు నిలిచిపోయాయని, పై కప్పు నుంచి వర్షపు నీళ్లు లీకయ్యాయని ఆరోపించింది. అంతేకాదు, స్టేడియంలోని మెట్లపై నీరు జలపాతంలా ప్రవహిస్తున్న వీడియోను కూడా పంచుకుంది.
బీజేపీ నేతల అబద్ధాలకు నరేంద్ర మోదీ స్టేడియం ఒక నిదర్శనం అని పేర్కొంది. ఐపీఎల్ ను ఇండియన్ పొలిటికల్ లీగ్ అని కూడా టీఎంసీ అభివర్ణించింది.