ఆ పాము నేరుగా వెళ్లి ఎన్టీఆర్ మెడకు చుట్టుకుంది: సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు

  • ఎన్టీఆర్ గురించి ప్రస్తావించిన సింగీతం 
  • 'ఉమా చండీ గౌరీ శంకరుల కథ' గురించి వివరణ 
  • ఎన్టీఆర్ చెప్పినట్టుగానే జరిగిందని వ్యాఖ్య  
  • ఆయనను కేవీ రెడ్డి అభినందించారని వెల్లడి
సింగీతం శ్రీనివాసరావు పేరు వినగానే దర్శకుడిగా ఆయన తెరకెక్కించిన 'పంతులమ్మ' .. 'పుష్పక విమానం' .. 'భైరవద్వీపం' వంటి ఎన్నో ఆణిముత్యాల వంటి సినిమాలు గుర్తుకువస్తాయి. దర్శకుడు కాకముందు ఆయన కేవీ రెడ్డి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. అలా కేవీ రెడ్డిగారి దగ్గర ఆయన పనిచేసిన సినిమాల్లో 'ఉమా చండీ గౌరీ శంకరుల కథ' ఒకటి. ఆ సినిమాను గురించి ఒక ఇంటర్వ్యూలో ఆయన ప్రస్తావించారు. 

ఈ సినిమాలో ఎన్టీ రామారావుగారు శివుడిగా కనిపిస్తారు. సహజత్వం కోసం తన మెడలో బొమ్మ పామును కాకుండా నిజం పామును వేయమని రామారావుగారు అన్నారు. దాంతో నిజం పామును తెప్పించి ఆయన మెడలో వేయబోయారు. అలా వద్దనీ .. పాము తనపైకి పాకుతూ రావాలని ఎన్టీఆర్ గారు అన్నారు. అలా వదిలితే పాము ఎటో ఒకవైపు వెళ్లిపోతుందనేది కేవీ రెడ్డి గారి కంగారు. 'ఫరవాలేదు .. ముందు మీరు ఆ పామును వదలండి' అని రామారావుగారు అన్నారు. 

దాంతో అయిష్టంగానే కేవీ రెడ్డిగారు పామును వదలమని చెప్పి షాట్ రెడీ అన్నారు. అందరూ ఆసక్తితో చూస్తున్నారు .. ఆ పాము ఎటువైపు వెళుతుందా అని. అది నేరుగా ఎన్టీఆర్ గారి కాళ్లపై నుంచి పాకుతూ వెళ్లి ఆయన మెడకి చుట్టుకుంది. షాట్ బాగా రాగానే .. 'ఇది నిజంగా చాలా మిరాకిల్ రామారావ్' అంటూ కేవీ రెడ్డిగారు అభినందించారు" అంటూ చెప్పుకొచ్చారు. 



More Telugu News