మెడిసిటీ కాలేజీ గుర్తింపు రద్దు అంటూ జరుగుతున్న ప్రచారంలో నిజంలేదు: మిమ్స్
- సుజనా చౌదరికి చెందిన మెడికల్ కాలేజీ గుర్తింపు రద్దు అంటూ వార్తలు
- ఖండించిన మిమ్స్ యాజమాన్యం
- సీట్ల పెంపుకోసం దరఖాస్తు చేసుకున్నామన్న సీవోవో
- లోటుపాట్లు ఉన్నాయని సీట్ల భర్తీని ఎన్ఎంసీ నిలిపివేసిందని వెల్లడి
- మళ్లీ దరఖాస్తు చేసుకుంటే అనుమతులు వస్తాయని వివరణ
- ఇది సాధారణ ప్రక్రియేనని స్పష్టీకరణ
బీజేపీ నేత సుజనాచౌదరికి చెందిన మెడిసిటి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (మిమ్స్) గుర్తింపును కేంద్రం రద్దు చేసిందంటూ వార్తలు రావడం తెలిసిందే. తాజా విద్యాసంవత్సరానికి సంబంధించి అడ్మిషన్లు జరపరాదని నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) ఆదేశించినట్టు ఆ వార్తల్లో పేర్కొన్నారు. ఈ వార్తలను మెడిసిటీ మెడికల్ కాలేజీ యాజమాన్యం ఖండించింది.
దీనిపై మిమ్స్ సీవోవో స్పందించారు. మిమ్స్ కళాశాలలో 2023-24 విద్యాసంవత్సరం కోసం సీట్లు పెంచడానికి ఎన్ఎంసీకి దరఖాస్తు చేశామని వెల్లడించారు. అయితే, వసతులకు సంబంధించి కొన్ని లోటుపాట్లు ఉన్నాయని సీట్ల భర్తీని జాతీయ వైద్య మండలి నిలిపివేసిందని వివరించారు.
ఇది తాత్కాలిక చర్య మాత్రమేనని, లోటుపాట్లను సరిదిద్దుకుని మళ్లీ దరఖాస్తు చేశాక అనుమతులు వస్తాయని సీవోవో స్పష్టం చేశారు. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియేనని వెల్లడించారు.