మూడు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు
- ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో భారీ వర్షాలు
- నల్గొండ, సూర్యాపేట సహా వివిధ జిల్లాల్లో వర్ష సూచన
- ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసిన వాతావరణ కేంద్రం
తెలంగాణలో రాగల 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది.
తెలంగాణలోని మిగిలిన చోట్ల ఉరుములు, మెరుపులతో తేలికపాటి వర్షాలు పడవచ్చునని పేర్కొంది. బుధవారం నుంచి గురువారం వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయని, ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. మంగళవారం పలుచోట్ల వర్షాలు కురిశాయి.