మా నాన్న నన్ను ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడు: వనిత విజయ్ కుమార్
- గతంలో 'దేవి' సినిమాలో చేసిన వనిత విజయ్ కుమార్
- 'మళ్లీ పెళ్లి' సినిమాతో రీ ఎంట్రీ
- తన తండ్రితో గొడవలపై ప్రస్తావన
- కొంతకాలం పాటు మైసూర్ లో ఉండిపోయానని వెల్లడి
అలనాటి నాయిక మంజుల వారసురాలిగా వనిత విజయ్ కుమార్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తమిళంలో కొన్ని సినిమాలు చేసిన ఆమె, ఆ తరువాత తెలుగు తెరకి 'దేవి' సినిమాతో పరిచయమయ్యారు. అదే తెలుగులో ఆమె చేసిన చివరి సినిమా కూడా. ఆ సినిమాకి నిర్మాతగా వ్యవహరించిన ఎమ్మెస్ రాజు, దర్శకుడిగా 'మళ్లీ పెళ్లి' సినిమాలో ఆమెకి అవకాశం ఇచ్చారు. అలా చాలా గ్యాప్ తరువాత ఆమె రీ ఎంట్రీ జరిగింది.
తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వనిత మాట్లాడుతూ .. "సాధారణంగా ఏ అమ్మాయికైనా తండ్రినే హీరో. అలాంటిది మా ఫాదర్ మాత్రం నా పాలిట విలన్ అని చెప్పలేనుగానీ, ఆయన నా పట్ల చాలా కఠినంగా ప్రవర్తించారు. మా ఫాదర్ కి, నాకు ఆస్తి తాలూకు గొడవలు ఉన్నాయి. ఆ విషయంలో ఆయన నన్ను పోలీసులతో ఇంట్లో నుంచి బయటికి గెంటించారు" అని అన్నారు.
"ఆ రోజు రాత్రి ఎక్కడికి వెళ్లాలనేది నాకు అర్థం కాలేదు .. నడిరోడ్డుపై నిలబడిపోయాను. అప్పుడు ఉన్న ప్రభుత్వం వలన ఆ పని చేయగలిగారు .. కానీ ఇప్పుడు వాళ్లు అలా చేయలేరు. ఆ పరిస్థితుల్లో నేను పిల్లలతో మైసూర్ వెళ్ళిపోయి అక్కడ కొంతకాలం ఉన్నాను. 'నువ్వు ఇకపై ఎప్పటికీ తమిళనాడులో అడుగుపెట్టలేవు' అని మా ఫాదర్ నాతో అన్నారు. అలాంటి తమిళనాడులో నేను ఈ రోజున దర్జాగా బ్రతుకుతున్నాను" అంటూ చెప్పుకొచ్చారు.