పెట్రోల్, డీజిల్‌పై నయారా ఎనర్జీ అదిరిపోయే న్యూస్!
- ప్రభుత్వ చమురు రంగ సంస్థల కంటే తక్కువకే పెట్రోల్, డీజిల్
- సుపీరియర్ గ్రేడ్ క్వాలిటీపై రూ.1 తగ్గింపు ప్రకటించిన రిలయన్స్ -బీపీ
- పెట్రోల్, డీజిల్ పైనా రూ.1 తగ్గిస్తున్నట్లు నయారా ప్రకటన
పెట్రోల్, డీజిల్ ధరలపై నయారా ఎనర్జీ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. ప్రభుత్వరంగ చమురు సంస్థల కంటే రూ.1 తక్కువ ధరకే చమురును విక్రయించనున్నట్లు తెలిపింది. నయారా కంటే ముందు రిలయన్స్ - బీపీ సుపీరియర్ గ్రేడ్ క్వాలిటీ డీజిల్ ను రూ.1 తక్కువకే విక్రయించనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో నయారా నుండి కూడా ఇలాంటి స్వల్ప ఊరట ప్రకటన వచ్చింది. ప్రభుత్వరంగ సంస్థలు ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్, భారత్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్, హిందూస్తాన్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ కంపెనీలు గత కొద్ది కాలంగా ధరలను స్థిరంగా కొనసాగిస్తున్నాయి.
ప్రభుత్వరంగ సంస్థలు చమురు ధరలను స్థిరంగా కొనసాగించడంతో ప్రయివేటు సంస్థలు నష్టాలు భరించలేక అధిక ధరకు పెట్రోల్, డీజిల్ ను విక్రయించాయి. దీంతో ప్రయివేటు చమురు రంగ సంస్థలు మార్కెట్ వాటాను కోల్పోతున్నాయి. అయితే ఇప్పుడు అంతర్జాతీయంగా చమురు ధరలు దిగి రావడంతో ఈ ప్రయోజనాన్ని ఇప్పుడు కస్టమర్లకు బదలీ చేస్తున్నాయి. సుపీరియర్ క్వాలిటీని రూ.1 తక్కువకు విక్రయిస్తామని రిలయన్స్ - బీపీ ప్రకటించగా, ఇప్పుడు నయారా పెట్రోల్, డీజిల్ పైన కూడా తగ్గించనున్నట్లు ప్రకటించింది.