ధోనీపై తమిళనాడు సీఎం పొగడ్తలు.. గూగుల్ సీఈవో పిచాయ్ సైతం
- ఐదో ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్న ఎల్లో బ్రిగేడ్ అంటూ స్టాలిన్ ట్వీట్
- ప్రతికూల పరిస్థితుల్లో జడేజా చిరస్మరణీయ విజయాన్ని అందించాడని ప్రశంస
- సీఎస్కేకి అభినందనలు తెలియజేసిన సుందర్ పిచాయ్
చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి మహేంద్ర సింగ్ ధోనీ మ్యాజిక్ తో ఐపీఎల్ విజేతగా నిలిచింది. దీంతో అభినందనలు, పొగడ్తల వర్షం కురుస్తూనే ఉంది. ఎంతో మంది నటీనటులు తమ స్పందన వ్యక్తం చేయగా, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ సైతం అభినందనలు తెలియజేశారు.
తమిళనాడు సీఎం స్టాలిన్ ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు. "ప్రతీ సందర్భానికి తగ్గట్టు ప్రణాళికాయుతంగా నడుచుకునే ఎంఎస్ ధోనీ సారథ్యంలో ఐదో ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్న సీఎస్కే ఎల్లో బ్రిగేడ్ కు అభినందనలు. ఇది అత్యుత్తమ క్రికెట్. ప్రతికూల పరిస్థితుల్లో తన నాడి పట్టుకున్న జడేజా సీఎస్కేకి చిరస్మరణీయ విజయాన్ని అందించాడు’’ అంటూ స్టాలిన్ తన స్పందన తెలియజేశారు. ధోనీకి స్టాలిన్ కూడా పెద్ద అభిమాని కావడం గమనార్హం.
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ సైతం స్పందించారు. సీఎస్కేకు అభినందనలు చెబుతూ.. గుజరాత్ టైటాన్స్ వచ్చే ఏడాది బలంగా తిరిగొస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చేసిన పోస్ట్ ను పిచాయ్ రీట్వీట్ చేశారు. జడేజా చివరి రెండు బంతులను అద్భుతమైన షాట్లుగా మలచడాన్ని ఐపీఎల్ తన ట్వీట్ లో ప్రత్యేకంగా ప్రస్తావించింది. రవీంద్ర జడేజా తనదైన స్టయిల్ లో ఆటను ముగించాడంటూ పోస్ట్ పెట్టగా, దాన్ని పిచాయ్ షేర్ చేశారు. సుందర్ పిచాయ్ స్కూల్, కాలేజీ విద్య అంతా చెన్నైలోనే జరగడం గమనార్హం.