ఐపీఎల్ 2023 సీజన్ లో ఎవరిని, ఏ అవార్డు వరించిందంటే..!

  • గుజరాత్ ఆటగాడు శుభ్ మాన్ గిల్ కు ఆరెంజ్ క్యాప్ అవార్డు
  • మహమ్మద్ షమీకి పర్పుల్ క్యాప్ అవార్డు
  • గిల్ కు మరెన్నో ఇతర అవార్డులు
  • ఎక్కువ దూరం సిక్సర్ బాదిన ఆటగాడిగా ఫాప్ డూప్లెసిస్
రెండు నెలల సుదీర్ఘ పోరు ముగిసింది. ఐపీఎల్ 2023 సీజన్ లో ఎన్నో రికార్డులు నమోదయ్యాయి. ఎంతో మంది యువ ఆటగాళ్ల ప్రతిభా, పాటవాలు వెలుగులోకి వచ్చాయి. ఈ 16వ ఐపీఎల్ సీజన్ లో అవార్డు విజేతల వివరాలను గమనించినట్టయితే..

  • ఐపీఎల్ 2023లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా శుభ్ మన్ గిల్ నిలిచాడు. 890 పరుగులు నమోదు చేసిన అతడ్ని ఆరెంజ్ క్యాప్ అవార్డు వరించింది. 
  • ఇక ఈ సీజన్ లో అత్యధికంగా మహమ్మద్ షమీ 28 వికెట్లను తీశాడు. పర్పుల్ క్యాప్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ రెండు అవార్డులు రన్నరప్ అయిన గుజరాత్ ఆటగాళ్లకు దక్కాయి. 
  • ఈ సీజన్ లో చక్కగా, సమయోచితంగా ఆడిన ఆటగాడిగా అజింక్య రహానే నిలిచాడు. ఫేర్ ప్లే ఆఫ్ ద సీజన్ అవార్డు అతడికి లభించింది.
  • ఇక చక్కని క్యాచ్ తో ‘క్యాచ్ ఆఫ్ ద సీజన్ అవార్డు’ను రషీద్ ఖాన్ సొంతం చేసుకున్నాడు. 
  • బెంగళూరు జట్టు కెప్టెన్ ఫాప్ డూప్లెసిస్ ను లాంగెస్ట్ సిక్స్ ఆఫ్ ద సీజన్ అవార్డు వరించింది. అతడు కొట్టిన ఒక సిక్సర్ 115 మీటర్ల దూరం వెళ్లింది.
  • 84 ఫోర్లతో అత్యధిక ఫోర్లు సాధించిన ఆటగాడి అవార్డు గిల్ కు దక్కింది.
  • ఎంతో విలువైన ఆటగాడి అవార్డు కూడా శుభ్ మాన్ గిల్ కే దక్కింది.
  • సూపర్ స్ట్రయికర్ ఆఫ్ ద సీజన్ అవార్డు ఆర్సీబీ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్ వెల్ కు లభించింది.
  • ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు యశస్వి జైస్వాల్ ను వరించింది. 
  • అత్యుత్తమ వేదికలుగా కోల్ కతా ఈడెన్ గార్డెన్స్, ముంబై వాంఖడే స్టేడియంలకు సంయుక్తంగా అవార్డు లభించింది.


More Telugu News