బెంగళూరులో దడపుట్టిస్తున్న వెరైటీ మాఫియా.. వాహనాల టైర్లకు విపరీతంగా పంక్చర్లు..!

  • బెంగళూరు వీధుల్లో భారీగా మేకులు, ఇతర మొనదేలిన వస్తువులను విసిరేస్తున్న నిందితులు
  • వాహనాలకు పంక్చర్లు కావడంతో సమీపంలోని రిపేర్ షాపులకు క్యూకడుతున్న వాహనదారులు
  • రిపేర్లతో వాహనదార్ల జేబులకు చిల్లు, నిందితులకు ఆదాయం 
బెంగళూరులో ఓ కొత్త మాఫియా ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. ఈ మాఫియా కారణంగా ప్రజల వాహనాల టైర్లకు తరచూ పంక్చర్లు పడుతున్నాయి. వాటిని రిపేర్లు చేయించుకునే క్రమంలో జనాల జేబులు ఖాళీ అవుతున్నాయి. 

కొందరు వీధుల్లో మేకులు, ఇతర పదునైన వస్తువులు ఉంచి వాహనాల టైర్లు పంక్చర్లయ్యేలా చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఫలితంగా, ఆ చుట్టుపక్కల ఉన్న షాపుల్లో రిపేర్లు చేయించుకునేందుకు వాహనదారులు క్యూకడుతున్నారట. ఈ క్రమంలో కొందరు దండిగా డబ్బులు సంపాదించుకుంటున్నట్టు పోలీసులు గుర్తించారు. 

ఆనేపాళ్య, నంజప్ప కూడలి, అపేరా జంక్షన్ తదితర ప్రాంతాల్లో పోలీసులు తరచూ కిలోకు పైగా మేకులు, ఇనుప తీగలను తొలగిస్తున్నారు. రహదారులు, దత్తపీఠానికి వెళ్లే మార్గంలోనే మేకులు వేసే మాఫియా యాక్టివ్‌గా ఉన్నట్టు గుర్తించారు. ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తేనే ఈ మాఫియా ఆట కట్టించగలమని అశోకనగర ఠాణాలో ట్రాఫిక్ ఎస్సై మహ్మద్ ఇమ్రాన్ అలీ అభిప్రాయపడ్డారు.


More Telugu News