నిలిచిన వాన... ఐపీఎల్ ఫైనల్లో సీఎస్కే టార్గెట్ కుదింపు
- అహ్మదాబాద్ లో ఐపీఎల్ ఫైనల్
- తొలుత 20 ఓవర్లలో 4 వికెట్లకు 214 పరుగులు చేసిన గుజరాత్
- వర్షంతో నిలిచిన చెన్నై చేజింగ్
- సీఎస్కే టార్గెట్ 15 ఓవర్లలో 171 రన్స్
ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న అహ్మదాబాద్ లో వరుణుడు శాంతించాడు. దాంతో, గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ కొనసాగేందుకు మార్గం సుగమం అయింది. అయితే, వర్షం కారణంగా మ్యాచ్ చాలా సమయం పాటు నిలిచిపోవడంతో, ఓవర్లను, లక్ష్యాన్ని కుదించారు.
ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 214 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో 0.3 ఓవర్లలో చెన్నై సూపర్ కింగ్స్ 4 పరుగులు చేసిన అనంతరం వర్షం రావడంతో మ్యాచ్ నిలిచింది.
వర్షం తగ్గిన అనంతరం చెన్నై జట్టు లక్ష్యాన్ని 15 ఓవర్లలో 171 పరుగులకు కుదించారు. ఒక్కో బౌలర్ గరిష్ఠంగా 3 ఓవర్లు విసరొచ్చు. పవర్ ప్లే 4 ఓవర్ల పాటు కొనసాగుతుంది.