కొత్త పార్లమెంట్ కాంప్లెక్స్... ప్రధాని మోదీపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సెటైర్

కొత్త పార్లమెంట్ కాంప్లెక్స్... ప్రధాని మోదీపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సెటైర్
  • వివిధ మఠాధిపతులతో పార్లమెంట్ ఆవరణలో ప్రధాని మోదీ ఫోటో
  • ట్విట్టర్ వేదికగా ప్రధానికి చురకలు అంటించిన మమత
  • స్వాతంత్య్రం వచ్చాక... ఇప్పుడు అంటూ నెహ్రూ, మోదీ ఫోటోలతో ట్వీట్
కొత్త పార్లమెంట్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకు పడ్డారు. ఆమె ట్విట్టర్ వేదికగా తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, ప్రస్తుత ప్రధాని మోదీలు పార్లమెంటు ఆవరణలో దిగిన ఫోటోలతో విమర్శలు గుప్పించారు. మే 28న జరిగిన కొత్త పార్లమెంటు కాంప్లెక్స్ ప్రారంభోత్సవానికి హాజరయ్యేందుకు ఢిల్లీకి వివిధ తమిళనాడు మఠాల నుండి వచ్చిన మఠాధిపతుల బృందంతో ప్రధాని మోదీ ఫోటో దిగారు.

మమత ఈ చిత్రాన్ని భారతదేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూతో లింక్ చేశారు. రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్, బిఆర్ అంబేడ్కర్, సర్దార్ వల్లభాయ్ పటేల్ తదితరులు ఉన్న ఫోటోను, మోదీ, మఠాధిపతులతో ఉన్న ఫోటోను ట్వీట్ చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత, ఇప్పుడు అంటూ రెండు ఫోటోలకు క్యాప్షన్ పెట్టారు.


More Telugu News