ఎయిరిండియాలో నియామకాలపై సీఈవో ఏమన్నారంటే..!
- ప్రతి నెల 600 మందిని నియమించుకుంటున్నట్లు వెల్లడి
- లాభాల్లోకి తీసుకు వచ్చేందుకు అయిదేళ్ల ప్రణాళికను ప్రకటించిన సంస్థ
- విమానాల కొనుగోలుకు ఒప్పందం
ఎయిరిండియా అయిదేళ్ల అభివృద్ధి ప్రణాళికకు మార్కెట్ ట్రెండ్ మంచి ఆరంభాన్ని ఇచ్చిందని కంపెనీ ఎండీ, సీఈవో విల్సన్ అన్నారు. ప్రస్తుతం ప్రతి నెల 550 మంది క్యాబిన్ సిబ్బంది 50 మంది పైలట్ల నియామకాలు చేపడుతున్నట్లు చెప్పారు. ముందు ముందు కూడా ఇదే ధోరణితో కొనసాగుతుందన్నారు. గత ఏడాది జనవరిలో కేంద్ర ప్రభుత్వం నుండి ఎయిరిండియా సంస్థను టాటా గ్రూప్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ సంస్థను లాభాల్లోకి తీసుకు వచ్చేందుకు అయిదేళ్ల ప్రణాళికను ప్రకటించింది. ఈ క్రమంలో మరిన్ని విమానాలను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ నేపథ్యంలో క్యాబిన్ సిబ్బంది, పైలట్లను పెద్ద ఎత్తున నియమించుకోనుంది. అయితే సిబ్బంది నియామకాలకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి లక్ష్యాలను నిర్దేశించుకోలేదని తెలిపింది. ఎయిరిండియా ఎక్స్ ప్రెస్, ఎయిర్ ఏషియా, విస్తారాల విలీనం నేపథ్యంలో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు.. ఎంతమంది అవసరం ఉంది... భవిష్యత్తు అవసరాల కోసం ఎంతమందిని నియమించుకోవాలనేది తెలుస్తుందన్నారు. ఈ నెల ప్రారంభంలో ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ దాదాపు 4 వేల మంది ఉద్యోగులను నియమించింది.