నిన్న నిద్రలేని రాత్రి గడిచింది: రెజ్లర్ల ఇష్యూపై అభినవ్ బింద్రా
- జంతర్ మంతర్ వద్ద రెజ్లర్లపై ఢిల్లీ పోలీసుల చర్యను ఖండించిన బింద్రా
- క్రీడా సంస్థల్లో స్వతంత్ర రక్షణ చర్యలను ఏర్పాటు చేసే సమయమని వ్యాఖ్య
- ప్రతి అథ్లెట్ సురక్షితమైన, సాధికారతతో కూడిన వాతావరణానికి అర్హులన్న అభినవ్
భారత టాప్ రెజ్లర్లపై ఢిల్లీ పోలీసుల తీరు మీద ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ షూటర్ అభినవ్ బింద్రా ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం జంతర్ మంతర్ వద్ద రెజ్లర్లపై ఢిల్లీ పోలీసుల చర్యను ఆయన ఖండించారు. తోటి దేశీయ రెజ్లర్లు నిరసన వ్యక్తం చేస్తున్న భయానక చిత్రాలు తనను వెంటాడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇది క్రీడా సంస్థల్లో స్వతంత్ర రక్షణ చర్యలను ఏర్పాటు చేసే సమయమన్నారు.
'నిన్న నిద్ర లేని రాత్రి గడిచింది. తోటి భారతీయ రెజ్లర్లు నిరసన వ్యక్తం చేస్తున్న భయానక చిత్రాలు నన్ను వెంటాడాయి. క్రీడా సంస్థలకు సంబంధించి స్వతంత్ర రక్షణ చర్యలను ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైంది. అటువంటి పరిస్థితులు తలెత్తితే, వారు అత్యంత సున్నితత్వం, గౌరవంతో వ్యవహరించేలా చూసుకోవాలి. ప్రతి అథ్లెట్ సురక్షితమైన, సాధికారతతో కూడిన వాతావరణానికి అర్హులు' అని అభినవ్ బింద్రా సోమవారం ట్వీట్ చేశారు.