ఐపీఎల్ ఫైనల్లో టాస్ గెలిచిన ధోనీ... కానీ!
- నిన్న వర్షంతో వాయిదా పడిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్
- నేడు రిజర్వ్ డేలో ఫైనల్ నిర్వహణ
- గుజరాత్ టైటాన్స్ పై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సీఎస్కే
- గత మ్యాచ్ ఇలాగే టైటాన్స్ పై టాస్ గెలిచి మ్యాచ్ ఓడిన ముంబయి
నిన్న వర్షం కారణంగా నేటికి వాయిదా పడిన ఐపీఎల్ 16వ సీజన్ ఫైనల్ మ్యాచ్ లో కొద్దిసేపటి కిందట టాస్ వేశారు. గుజరాత్ టైటాన్స్ పై టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ బౌలింగ్ ఎంచుకున్నాడు.
మొన్న క్వాలిఫయర్-2 మ్యాచ్ లో ఇలాగే టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ బౌలింగ్ తీసుకోగా... మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ వీరవిహారం చేసి 233 పరుగులు చేసింది. ఆ మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ 62 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది.
ఈ నేపథ్యంలో, టాస్ గెలిచినప్పుడు బ్యాటింగ్ తీసుకోక, మొదట బౌలింగ్ చేయాలన్న నిర్ణయం ఏంటని ధోనీ డెసిషన్ పై క్రికెట్ పండితులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మామూలు మ్యాచ్ లు అయితే ఫర్వాలేదు కానీ, ఎంతో ఒత్తిడితో కూడిన ఫైనల్ మ్యాచ్ ల్లో లక్ష్యాన్ని ఛేదించడం ఏమంత సులభం కాదని వాదిస్తున్నారు.
అయితే, నిన్న అహ్మదాబాద్ లో భారీ వర్షం పడిందని, పిచ్ పై తేమ పేసర్లకు అనుకూలంగా ఉంటుందన్న ఉద్దేశంతోనే ధోనీ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నాడని, గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అయినా టాస్ గెలిచుంటే బౌలింగే తీసుకునేవాడని మరో వర్గం వాదిస్తోంది.
చెన్నై సూపర్ కింగ్స్...
మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, మొయిన్ అలీ, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, దీపక్ చహర్, మతీష పతిరణ, తుషార్ దేశ్ పాండే, మహీశ్ తీక్షణ.
గుజరాత్ టైటాన్స్...
హార్దిక్ పాండ్యా (కెప్టెన్), శుభ్ మాన్ గిల్, వృద్ధిమాన్ సాహా, సాయి సుదర్శన్, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, మహ్మద్ షమీ.