పలు జిల్లాల్లో వడగళ్ల వాన... ఆరెంజ్ అలర్ట్ జారీ

  • భద్రాద్రి, కొత్తగూడెం, వరంగల్, జనగామ, యాదాద్రి తదితర ప్రాంతాల్లో వర్ష సూచన
  • ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 50 కి.మీ. వేగంతో వడగళ్ల వాన పడవచ్చు
  • బుధవారం నుండి శనివారం వరకు పలుచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు
రానున్న నాలుగు రోజుల పాటు తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వెల్లడించింది. సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగామ, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్‌ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గంటకు 40-50 కి.మీ. వేగంతో ఈదురు గాలులతో వడగళ్ల వాన కురిసే అవకాశముందని తెలిపింది.

ఈ మేరకు వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది. మంగళవారం పలుచోట్ల పొడి వాతావరణం ఏర్పడే సూచనలున్నాయని, పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వర్షాలు పడుతాయని తెలిపింది. బుధవారం నుంచి శనివారం వరకు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.


More Telugu News