పొంగులేటి, జూపల్లి నాకే రివర్స్ కౌన్సిలింగ్ ఇస్తున్నారు: ఈటల
- బీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురైన పొంగులేటి, జూపల్లి
- ఇంకా ఏ పార్టీలో చేరని నేతలు
- వారిని బీజేపీలోకి తీసుకువచ్చేందుకు ఈటల ముమ్మర ప్రయత్నాలు
- వారు బీజేపీలో చేరడం కష్టమేనన్న ఈటల
బీఆర్ఎస్ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావుల పయనం ఎటు అన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. బీజేపీ ఎమ్మెల్యే, ఆ పార్టీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ నిత్యం పొంగులేటి, జూపల్లితో మాట్లాడుతూ, వారిని బీజేపీలోకి ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఈటల ప్రయత్నాలు ఏమంత ఫలప్రదం అవుతున్న సూచనలు లేవు. ఈటల వ్యాఖ్యలే అందుకు నిదర్శనం.
తాను ప్రతిరోజు పొంగులేటి, జూపల్లితో మాట్లాడుతున్నానని, కానీ వారు బీజేపీలో చేరడం కష్టమేనని అన్నారు. పైగా వారు తనకు రివర్స్ కౌన్సిలింగ్ ఇస్తున్నారని వెల్లడించారు. ఇప్పటివరకు వారిని కాంగ్రెస్ లో చేరకుండా మాత్రమే ఆపగలిగానని ఈటల తెలిపారు. బీజేపీలో చేరడానికి వారికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయని అన్నారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ బలంగా ఉందని తెలిపారు.