చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోలోని హామీలు దరిద్రంగా ఉన్నాయి: సజ్జల
- తమ పథకాలను కాపీ కొట్టారన్న సజ్జల
- చంద్రబాబు గతంలో ఏంచేశాడో చెప్పుకోగలడా అని ప్రశ్నించిన వైనం
- అబద్ధాల్లో చంద్రబాబుకు గిన్నిస్ రికార్డు ఇవ్వొచ్చని విమర్శలు
రాజమండ్రి మహానాడు సభలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తొలి విడత మేనిఫెస్టో ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ అగ్రనేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోలోని హామీలు దరిద్రంగా ఉన్నాయని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను కూడా కాపీ కొట్టి మేనిఫెస్టోలో పెట్టారని ఆరోపించారు.
అరాచకం, అవినీతిలో చంద్రబాబు కొత్త రికార్డు సృష్టించారని ఎద్దేవా చేశారు. "చంద్రబాబు గతంలో ఏంచేశాడో చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదు... మేం ఇది చేశాం అని మేం చెప్పుకోగలం. కానీ చంద్రబాబు ఏం చెప్పుకోగలరు? అబద్ధాల్లో చంద్రబాబుకు గిన్నిస్ రికార్డు ఇవ్వొచ్చు" అని సజ్జల వ్యంగ్యం ప్రదర్శించారు.
14 ఏళ్లు సీఎంగా ఉన్నానని చెప్పుకునే చంద్రబాబు ప్రజలకు చేసిందేమిటి అని ప్రశ్నించారు. మేం ఇది చేశాం అని తాము ప్రజలను ఓట్లు అడగ్గలమని, చంద్రబాబు ఏంచేయలేదు కాబట్టి ఆయనకు ఆ అవకాశం లేదని విమర్శించారు.