'టక్కర్' కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను: సిద్ధార్థ్
- సిద్ధార్థ్ హీరోగా రూపొందిన 'టక్కర్'
- యాక్షన్ తో కూడిన రొమాంటిక్ లవ్ స్టోరీ
- కథానాయికగా నటించిన దివ్యాన్ష కౌశిక్
- యాక్షన్ సీన్స్ హైలైట్ గా ఉంటాయన్న సిద్ధార్థ్
- జూన్ 9వ తేదీన సినిమా విడుదల
ఒకప్పుడు హీరోగా సిద్ధార్థ్ కి ఇక్కడ మంచి ఫాలోయింగ్ ఉండేది. ఇప్పుడు అడపా దడపా మాత్రమే ఆయన తెలుగు తెరపై కనిపిస్తున్నాడు. ఆయన హీరోగా రూపొందిన 'టక్కర్' సినిమా, జూన్ 9వ తేదీన తమిళంతో పాటు తెలుగులోను విడుదల కానుంది. టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమాలో సిద్ధార్థ్ సరసన నాయికగా దివ్యాన్ష కనిపించనుంది.
ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో, ప్రమోషన్స్ తో టీమ్ బిజీగా ఉంది. తెలుగు వెర్షన్ కి సంబంధించి కొంతసేపటి క్రితం జరిగిన ప్రెస్ మీట్ లో సిద్ధార్థ్ మాట్లాడుతూ .. "పూర్తి కమర్షియల్ సినిమాగా కార్తీక్ జి. క్రిష్ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాలో నన్ను కార్తీక్ చాలా కొత్తగా చూపించాడు. యాక్షన్ అండ్ రొమాంటిక్ టచ్ తో ఈ లవ్ స్టోరీ నడుస్తుంది" అని అన్నాడు.
"ఈ ఆగస్టుకి హీరోగా 20 ఏళ్ల కెరియర్ ను పూర్తిచేసినట్టు అవుతుంది. ఇప్పటికీ నా చేతిలో ఓ అరడజను సినిమాలు ఉండటం ఆనందాన్ని కలిగిస్తోంది. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని మరీ ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ చేశాను. 35 రోజుల పాటు యాక్షన్ సీన్స్ తీయడం జరిగింది. ఈ సినిమాలో దివ్యాన్ష పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ జనరేషన్ కి ఈ లవ్ స్టోరీ తప్పకుండా కనెక్ట్ అవుతుంది" అంటూ చెప్పుకొచ్చాడు.