ఐపీఎల్ ఫైనల్ వాయిదాతో.. నెట్ లో మీమ్స్ వెల్లువ

  • ఎవరికి తోచిన విధంగా వారు వ్యంగ్య ట్వీట్లు
  • పీకల దాకా మైదానంలో నీరు.. అందులోనే ఆడుతున్న క్రికెటర్లు
  • నిరాశతో టీవీని బద్దలు కొడుతున్న దృశ్యం
చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా వాయిదా పడింది. సెలవుదినం, ఫైనల్ మ్యాచ్ కావడంతో చాలా మంది ఉత్సాహంగా స్టేడియానికి విచ్చేశారు. చివరికి వర్షం చేసిన పనితో తీవ్ర నిరాశ చెందారు. అధిక శాతం మంది వర్షం నిలిచిపోతే మ్యాచ్ మొదలవుతుందని, చూద్దామని ఆశగా ఎదరు చూసి, చివరికి నిరాశతో ఇంటి ముఖం పట్టారు. ఈ సందర్భంగా ఇంటర్నెట్ లో మీమ్స్ వెల్లువెత్తాయి. ఎవరికి తోచిన విధంగా వారు సెటైర్ వేసుకుంటూ, ఇమేజ్ లను షేర్ చేశారు. 

‘‘ఎవరు అయితే రూ.12,000 పెట్టి టికెట్ కొన్నారో.. దాని విలువ రూ.6 వేలే. రేపు వర్కింగ్ రోజు’’ అని సాగర్ అనే ట్విట్టర్ యూజర్ కామెంట్ చేశాడు.  గొంతు దాకా స్టేడియంలో నీరు నిలిచిపోవడంతో అందులోనే క్రికెట్ ఆడుతున్నట్టు రూపమ్ సాధుకా అనే వ్యక్తి ఓ ఇమేజ్ ను ట్వీట్ చేశాడు. ఇది చూడగానే నవ్వు తెప్పించే విధంగా ఉంది. ‘‘మీ ఫిజికల్ టికెట్లను దయచేసి భద్రంగా ఉంచుకోండి’’ అన్న సందేశం స్టేడియంలో ప్రదర్శిస్తున్న ఫొటోని దర్శన్ అనే వ్యక్తి పంచుకున్నాడు. ఇక మరీ నవ్వు తెప్పించే విధంగా.. ‘‘గేమ్ వచ్చే 30 నిమిషాల్లో ప్రారంభం కాకపోతే నా పరిస్థితి ఇదీ’’ అంటూ రీడర్ అనే ట్విట్టర్ యూజర్ ఓ వీడియో క్లిప్ షేర్ చేశాడు. అందులో టీవీని బద్దలు చేస్తున్న దృశ్యాన్ని చూడొచ్చు.


More Telugu News