ఈరోజు కూడా మ్యాచ్ జరగకపోతే గుజరాత్ టైటాన్స్ కే ఐపీఎల్ టైటిల్

  • భారీ వర్షంతో రిజర్వ్ డే కు మారిన ఫైనల్ మ్యాచ్
  • అహ్మదాబాద్ లో నేడు కూడా వర్షం కురిసే అవకాశం
  • మ్యాచ్ కు అంతరాయం కలిగితే సూపర్ ఓవర్ నిర్వహణ
  • అప్పటికీ ఫలితం తేలకుంటే పాయింట్ల పట్టిక ఆధారంగా గుజరాత్ టైటాన్స్ దే టైటిల్ 
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫైనల్ మ్యాచ్ కు వరణుడు అడ్డుపడిన విషయం తెలిసిందే. దీంతో మ్యాచ్ ను నిర్వాహకులు రిజర్వ్ డే అంటే.. సోమవారానికి మార్చారు. ఈ రోజు 20 ఓవర్ల మ్యాచ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే, అహ్మదాబాద్ లో నేడు కూడా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఫైనల్ మ్యాచ్ జరుగుతుందా? లేదా? అని అభిమానుల్లో ఆందోళన నెలకొంది. వర్షం కారణంగా మ్యాచ్ జరిగే అవకాశం లేకుంటే ఏం జరగనుంది.. విజేతను ఎలా నిర్ణయిస్తారనే వివరాలు మీకోసం..

రిజర్వ్ డే నాడు కూడా వర్షం వల్ల ఫైనల్ మ్యాచ్ కు అంతరాయం కలిగితే..
  • ఓవర్లను కుదించి మ్యాచ్ నిర్వహించేందుకు ప్రయత్నం చేస్తారు. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. వర్షం వల్ల మ్యాచ్ ఆలస్యమైతే.. 
  • రాత్రి 9:45 గంటల లోపు మ్యాచ్ మొదలైతే 20 ఓవర్ల ఆట కొనసాగుతుంది. 
  • అప్పటికీ మ్యాచ్ ప్రారంభించే పరిస్థితిలేకుంటే.. రాత్రి 11:56 గంటలకు 5 ఓవర్ల మ్యాచ్ జరుగుతుంది.
  • ఒకవేళ అప్పటికీ వర్షం ఆగకుంటే రాత్రి 1 గంట వరకు వేచి చూస్తారు. రాత్రి 1:20 గంటలకు వాతావరణం అనుకూలిస్తే సూపర్ ఓవర్ ద్వారా ఐపీఎల్ విజేతను నిర్ణయిస్తారు.
  • అదికూడా సాధ్యం కాని పక్షంలో ఐపీఎల్ పాయింట్ల పట్టికలో టాప్ లో ఉన్న గుజరాత్ టైటాన్స్ ను విజేతగా ప్రకటిస్తారు.


More Telugu News