అసోంలో తొలి ‘వందే భారత్‌’ రైలు.. నేడే ప్రారంభం!

  • నేటి మధ్యాహ్నం 12.00 గంటలకు ప్రారంభించనున్న ప్రధాని మోదీ
  • గువాహటి, న్యూజల్పైగురి మధ్య పరుగులు పెట్టనున్న రైలు
  • అయిదున్నర గంటల్లోనే 411 కిలోమీటర్ల ప్రయాణం పూర్తి
అసోం రాష్ట్ర ప్రజలకు తొలిసారిగా వందేభారత్ రైలు అందుబాటులోకి రానుంది. సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ గువాహటి-న్యూజల్పైగురి మార్గంలో వందేభారత్‌ను వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించనున్నారు. రాష్ట్ర ప్రజలకు మెరుగైన రైల్వే సౌకర్యాలు కల్పించే క్రమంలో ప్రధాని మోదీ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను లాంఛ్ చేయనున్నారు. 

వర్చువల్‌గా జరగనున్న ఈ కార్యక్రమంలో ప్రధాని, బొంబైగావ్-దుద్నోయ్-మెండిపతేర్, గౌహతి-చాపర్ముఖ్ కొత్తగా విద్యుద్దీకరించిన రైలు మార్గాలనూ జాతికి అంకితమిస్తారు. వందేభారత్‌ రైల్లో గువాహటి నుంచి 411 కిలోమీటర్ల దూరంలోని న్యూజల్పైగురికి కేవలం అయిదున్నర గంటల్లోనే చేరుకోవచ్చు. ఈ సర్వీసును వారానికి ఐదు రోజులు నడుపుతామని అధికారులు చెప్పారు.


More Telugu News