బీజేపీ టార్గెట్ క్లియర్.. కొత్త పార్లమెంటులో పలు దేశాలతో ఉన్న అఖండ భారత్ చిత్రం ఏర్పాటు

  • పార్లమెంటులో పురాతన అఖండ భారత్ కుడ్య చిత్రం ఏర్పాటు
  • మ్యాప్ లో ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, థాయ్ లాండ్ దేశాలు
  • అఖండ భారత్ సంకల్పాన్ని సూచిస్తుందన్న ప్రహ్లాద్ జోషి
కేంద్రంలో వరుసగా రెండు పర్యాయాలు అధికారాన్ని చేజిక్కించుకున్న బీజేపీ... వచ్చే ఎన్నికల్లో సైతం సత్తా చాటి హ్యాట్రిక్ కొట్టాలనే పట్టుదలతో ఉంది. ఇదే సమయంలో తన లక్ష్యం ఏమిటో బీజేపీ స్పష్టం చేసింది. కొత్త పార్లమెంటు భవనం నిన్న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ భవనంలో అఖండ భారత్ కుడ్య చిత్రాన్ని ఏర్పాటు చేయడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

పురాతన భారత్ (అఖండ భారత్) లోని నగరాలన్నింటినీ ఈ మ్యాప్ లో చేర్చారు. ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్, థాయ్ లాండ్, నేపాల్ తదితర దేశాలు మ్యాప్ లో ఉన్నాయి. దీనిపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ... కొత్త పార్లమెంటులో ఏర్పాటు చేసిన ఈ మ్యాప్ అఖండ భారత్ సంకల్పాన్ని సూచిస్తుందని చెప్పారు. బీజేపీ సంకల్పాన్ని ఇది స్పష్టం చేస్తుందని తెలిపారు.


More Telugu News