ఐపీఎల్ ఫైనల్... అహ్మదాబాద్ లో ఆగని వర్షం
- అహ్మదాబాద్ లోని మోదీ స్టేడియం వేదికగా ఐపీఎల్ ఫైనల్
- చెన్నై సూపర్ కింగ్స్ × గుజరాత్ టైటాన్స్
- సాయంత్రం నుంచి అహ్మదాబాద్ లో వర్షం
- ఇంకా టాస్ కూడా వేయని వైనం
- మైదానాన్ని కవర్లతో కప్పేసిన సిబ్బంది
ఐపీఎల్ 16వ సీజన్ ఫైనల్ పై వరుణుడు పంజా విసిరాడు. చెన్నై సూపర్ కింగ్స్ గుజరాత్ టైటాన్స్ మధ్య టైటిల్ పోరును వీక్షించేందుకు వచ్చిన అభిమానులు వరుణుడి జోరుతో నిరాశకు గురయ్యారు.
ఈ సాయంత్రం నుంచి అహ్మదాబాద్ లో కురుస్తున్న వర్షంతో మ్యాచ్ ఇంతవరకు ప్రారంభం కాలేదు. కనీసం టాస్ వేసేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది. ఇప్పటికీ అహ్మదాబాద్ లో వర్షం కురుస్తూనే ఉంది.
మధ్యలో కొంత విరామం ఇవ్వడంతో మైదానాన్ని కప్పి ఉంచి కవర్లు తొలగించారు. ఆటగాళ్లు మైదానంలో దిగి కాస్త ప్రాక్టీసు చేసే ప్రయత్నం చేశారు. అయితే మళ్లీ వర్షం మొదలవడంతో పరిస్థితి మొదటికి వచ్చింది. దాంతో మైదానాన్ని మరోసారి కవర్లతో కప్పేశారు.
రాత్రి 12.06 గంటల వరకు మ్యాచ్ ప్రారంభం కాకపోతే, మ్యాచ్ ను రేపు రిజర్వ్ డేలో నిర్వహించే అవకాశాలు ఉన్నాయని ఐపీఎల్ అధికారులు తెలిపారు.