రాజకీయ రౌడీలు.. ఖబడ్దార్.. జాగ్రత్త!: చంద్రబాబు

  • రాజమండ్రి మహానాడు సభలో చంద్రబాబు ప్రసంగం
  • భారీ పసుపు సైన్యాన్ని చూసి చంద్రబాబులో ఉత్సాహం
  • అంకితభావం కలిగిన కార్యర్తలే టీడీపీ బలం అని వెల్లడి
  • టీడీపీని దెబ్బతీద్దామని అనేకమంది విఫలమయ్యారని విమర్శలు
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని వేమగిరి వద్ద మహానాడు ముగింపు సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు. ఈ భారీ బహిరంగ సభకు పోటెత్తిన పసుపు సైన్యాన్ని చూసి చంద్రబాబులో ఉత్సాహం కనిపించింది. అంకితభావం కలిగిన కార్యకర్తలు ఉండడమే టీడీపీ బలం అని పేర్కొన్నారు. ఈ నాలుగేళ్లలో టీడీపీ కార్యకర్తలను ఎన్నోరకాలుగా ఇబ్బందులు పెట్టారని ఆరోపించారు. రాజకీయ రౌడీలు... ఖబడ్దార్... జాగ్రత్త అంటూ చంద్రబాబు హెచ్చరించారు. టీడీపీని దెబ్బతీద్దామని చూసి అనేకమంది విఫలమయ్యారని తెలిపారు.

చంద్రబాబు ప్రసంగం హైలైట్స్...

  • తెలుగుదేశం పార్టీ పేదల పక్షపాతి. 
  • పాలనలో పేదవారి కోసం ఆలోచించిన నాయకుడు ఎన్టీఆర్. 
  • మహిళలకు రాజకీయాల్లో రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత ఎన్టీఆర్ కే చెందుతుంది. 
  • బడుగు, బలహీన వర్గాలను ఎన్టీఆర్ రాజకీయాల్లోకి తెచ్చారు. 
  • రూ.2కే కిలోబియ్యం తర్వాతే దేశంలో ఆహార భద్రత వచ్చింది. 
  • సంపద సృష్టించడం నేర్పిన పార్టీ మనదే. 
  • ఒకేసారి రూ.50 వేలు రైతు రుణమాఫీ చేసిన పార్టీ టీడీపీ. 
  • ఉద్యోగులకు 42 శాతం ఫిట్ మెంట్ ఇచ్చాం. ఇప్పుడు సమయానికి జీతాలు ఇచ్చే పరిస్థితి ఉందా? 
  • ప్రపంచంలో ఎక్కడా ఉండని విధంగా అమరావతి రాజధాని ఉండాలని భావించాం. 
  • అమరావతికి నాడు 29 వేల మంది రైతులు 34 వేల ఎకరాల భూమిని స్వచ్ఛందంగా ఇచ్చారు. అదీ రైతులకు తెలుగుదేశం పార్టీపై ఉండే నమ్మకం. 
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వరం పోలవరం. నదుల అనుసంధానం జరిగితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వొచ్చనే ఉద్దేశంతో పోలవరాన్ని పరుగులు పెట్టించాం.  
  • నాడు రూ.16 లక్షల కోట్లకు ఒప్పందాలు చేసుకున్నాం. 
  • నేడు వైసీపీ నాలుగేళ్ల పాలనలో ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందా? 
  • పేదవాళ్లకు, పెత్తందార్లకు పోరాటం అంటున్నారు.. ఇది క్యాస్ట్ వార్ కానే కాదు. ఇది క్యాష్ వార్. 
  • ప్రజల డబ్బు దోచుకునేవాళ్ల నుంచి ఆ డబ్బును తిరిగి స్వాధీనం చేసుకుని ప్రజలకే ఇచ్చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. 
  • పేదవాళ్ళను ధనికులను చేయడమే నా ఉద్దేశం 
  • వైసీపీ పాలనలో ధరలు పెరిగి ప్రజలంతా నష్టపోయారు. మద్యం ధరలు పెంచారు... నాసిరకం బ్రాండ్లు తెచ్చారు.  
  • ఈ ముఖ్యమంత్రి ఆదాయం రూ.510 కోట్లు. దేశంలోని అందరు ముఖ్యమంత్రుల ఆదాయం రూ.508 కోట్లు. 
  • నువ్వేమైనా వ్యవసాయం చేశావా, వ్యాపారం చేశావా, నువ్వేమైనా పెద్ద తెలివైనవాడివా... ఎలా సంపాదించావు ఇంత ఆదాయం? 
  • రాజకీయాలను వ్యాపారంగా మార్చాడు... దోచుకున్న డబ్బును దాచుకున్నాడు. ఇప్పుడా డబ్బును రాబట్టాలా, వద్దా? 



More Telugu News