ప్రధాని మోదీ తమిళులు గర్వించేలా చేశారు: రజనీకాంత్
- రేపు నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం
- స్పీకర్ కుర్చీ సమీపంలో రాజదండాన్ని ఆవిష్కరించనున్న మోదీ
- ఇది తమిళ శక్తికి సంప్రదాయ ప్రతిరూపమన్న రజనీకాంత్
భారత ప్రధాని నరేంద్ర మోదీ రేపు (మే 28) ఢిల్లీలో నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా పార్లమెంటులో స్పీకర్ కుర్చీ సమీపంలో ఓ బంగారు రాజదండాన్ని కూడా ఆవిష్కరించనున్నారు.
నాడు బ్రిటీష్ పాలకులకు, భారత మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు మధ్య అధికార బదలాయింపుకు ఈ రాజదండం నిదర్శనంగా నిలిచింది. ఈ రాజదండాన్ని 'సెంగోల్' అంటారు. ఇది తమిళ పదం. చోళ రాజుల కాలం నుంచి ఈ రాజదండం సంప్రదాయం వస్తోంది.
ఈ నేపథ్యంలో, దక్షిణాది సినీ సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందించారు. తమిళ శక్తికి సంప్రదాయ ప్రతిరూపం ఈ రాజదండం అని పేర్కొన్నారు. ఇక నుంచి భారత పార్లమెంటు నూతన భవనంలో కాంతులు విరజిమ్మనుందని తెలిపారు. ఈ సందర్భంగా తమిళులు గర్వపడేలా చేసిన ప్రధాని నరేంద్ర మోదీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని రజనీకాంత్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తమిళంలో ట్వీట్ చేశారు.