అది ఫేక్ అకౌంట్... కోహ్లీకి తాను సారీ చెప్పలేదన్న ఆఫ్ఘన్ బౌలర్
- ఆర్సీబీ, లక్నో మ్యాచ్ లో కోహ్లీ, నవీనుల్ హక్ మధ్య వాగ్వాదం
- నవీనుల్ హక్ ను టార్గెట్ చేసిన కోహ్లీ ఫ్యాన్స్
- సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్
- మైదానంలోనూ నవీనుల్ హక్ కనిపిస్తే చాలు.. గోల గోల!
ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీ, ఆఫ్ఘన్ బౌలర్ నవీనుల్ హక్ మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. ఈ ఘటన తర్వాత కోహ్లీ అభిమానులు నవీనుల్ హక్ ను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు.
లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ ఆడుతుంటే, గ్యాలరీలోని ప్రేక్షకులు నవీనుల్ హక్ ను ఉద్దేశించి నినాదాలు చేయడం కామన్ గా మారిపోయింది. నవీనుల్ హక్ సోషల్ మీడియాలో ఏ పోస్టు చేసినా, దాంతో కోహ్లీకి ఏమైనా లింకు ఉందేమోనని పరిశీలించడం పరిపాటిగా మారింది.
అయితే, ఎలిమినేటర్ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్... ముంబయి ఇండియన్స్ చేతిలో ఓడిపోయాక నవీనుల్ హక్ పేరిట సోషల్ మీడియాలో ఓ పోస్టు దర్శనమిచ్చింది. అందులో... నేను పెద్ద మిస్టేక్ చేశాను... ఐయాం సారీ విరాట్ కోహ్లీ అని ఉంది.
ఈ పోస్టు వైరల్ కావడంతో నవీనుల్ హక్ స్పందించాడు. అది ఫేక్ అకౌంట్ అని, తాను కోహ్లీకి సారీ చెప్పలేదని స్పష్టం చేశాడు. ఇలాంటి ఫేక్ అకౌంట్ల పట్ల అభిమానులు జాగ్రత్తగా ఉండాలని సూచించాడు.