త్వరలో వెండితెరపై ‘దాదా’గిరి.. గంగూలీ బయోపిక్ కు ఏర్పాట్లు!
- గంగూలీ బయోపిక్ ను తెరకెక్కించనున్న లవ్ రంజన్, అంకుర్ గార్గ్
- ఇటీవల కోల్ కతాలో గంగూలీతో వీరిద్దరూ భేటీ
- ఈ ఏడాది ఆఖర్లో సినిమా పట్టాలెక్కే చాన్స్
సౌరవ్ గంగూలీ.. మాజీ క్రికెటర్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు.. అంతేనా.. ఇండియన్ క్రికెట్ కు దూకుడు నేర్పిన కెప్టెన్ అతడు. ఇంగ్లండ్ లోని లార్డ్స్ స్టేడియం బాల్కనీ నుంచి టీషర్ట్ విప్పి దమ్ము చూపగలిగిన ఆటగాడు అతడు. అటు ఆటతోనూ.. ఇటు మాటతోనూ సమాధానం చెప్పగలిగిన ‘దాదా’ అతడు.
ఇప్పుడు ఇదంతా ఎందుకంటరా? గంగూలీ జీవితంపై సినిమా రాబోతోంది మరి. త్వరలోనే దాదా బయోపిక్ పట్టాలెక్కబోతోంది. ఇందుకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు జోరుగా సాగుతున్నాయి. డైరెక్టర్ లవ్ రంజన్, నిర్మాత అంకుర్ గార్గ్ ఇందులో బిజీ అయ్యారు.
ఇటీవల గంగూలీని రంజన్, అంకుర్ కలిశారు. కోల్ కతాలోని గంగూలీ ఇంట్లో సమావేశమై సినిమాపై చర్చించారు. గంగూలీ జీవితంలో పలు అంశాలను వాళ్లు రికార్డ్ చేసుకున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ పూర్తయిందని సమాచారం. గంగూలీ జీవితంలో బయటికి తెలియని ఎన్నో కోణాలను సినిమాలో చూపనున్నట్లు తెలుస్తోంది.
గతంలో టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ లపై సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. ధోనీ సినిమా సూపర్ హిట్ కాగా, సచిన్ సినిమా డాక్యుమెంటరీలా ఉండటంతో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు గంగూలీ జీవితం వెండి తెరపై ఆవిష్కృతం అయ్యేందుకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది చివర్లో సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. గంగూలీ పాత్రలో ఎవరు నటిస్తారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. రణ్ బీర్ కపూర్ పేరు వినిపిస్తున్నా.. అధికారికంగా ప్రకటించలేదు.