కేసీఆర్ నివాసంలో కేజ్రీవాల్, భగవంత్ మాన్ లంచ్
- హైదరాబాద్ వచ్చిన ఆప్ ముఖ్యమంత్రులు కేజ్రీవాల్, భగవంత్ మాన్
- ప్రగతి భవన్ లో ఆత్మీయ స్వాగతం పలికిన కేసీఆర్
- లంచ్ అనంతరం సమావేశం
- ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశానికి డుమ్మా కొట్టిన ముగ్గురు సీఎంలు
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ హైదరాబాదులో ఇవాళ ప్రగతిభవన్ కు విచ్చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తో వారు భేటీ అయ్యారు. ప్రగతి భవన్ కు విచ్చేసిన ఆప్ ముఖ్యమంత్రులకు కేసీఆర్ ఆత్మీయ స్వాగతం పలికారు. ఇరువురు సీఎంలతో కలిసి కేసీఆర్ లంచ్ చేయనున్నారు. అనంతరం సమావేశం జరపనున్నారు.
అధికారుల పోస్టింగులు, బదిలీలపై కేంద్రం తెచ్చిన ప్రత్యేక ఆర్డినెన్స్ ను వ్యతిరేకిస్తూ, కేజ్రీవాల్ ముమ్మర పోరాటం చేస్తున్నారు. ఈ అంశంలో సీఎం కేసీఆర్ మద్దతు కోరేందుకే కేజ్రీవాల్ హైదరాబాద్ వచ్చినట్టు తెలుస్తోంది.
ఓవైపు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం జరుగుతుండగా, మొత్తం ఏడుగురు సీఎంలు ఆ సమావేశానికి డుమ్మాకొట్టినట్టు సమాచారం. ఆ ఏడుగురిలో ముగ్గురు కేసీఆర్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ హైదరాబాదులో సమావేశమవుతున్నారు.