పార్లమెంట్ కొత్త భవనం.. ఈ వీడియో అందరితో పంచుకోండి: అమిత్ షా

  • యావత్ దేశం దీన్ని చూసి సంతోషిస్తోందన్న కేంద్ర హోంమంత్రి
  • దేశ సంస్కృతి, ఆధునికత కలబోతకు నిదర్శనమని వ్యాఖ్య
  • వీడియోని అందరితో షేర్ చేయాలని పిలుపు
పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవానికి ముందు.. ఇందుకు సంబంధించిన వీడియోని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తన ట్విట్టర్ పేజీ ద్వారా షేర్ చేశారు. దీనిపై ఆయన ఓ కీలక ప్రకటన కూడా చేశారు. కొత్త పార్లమెంట్ భవనం ప్రధాని ప్రారంభించడాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్న తరుణంలో అమిత్ షా ట్వీట్ కు ప్రాధాన్యం ఏర్పడింది. తాను ఓ ప్రజా ప్రతినిధిగా పార్లమెంట్ పాత, కొత్త భవనాల్లో, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం కింద ఉండడాన్ని ఎంతో అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు. 

‘‘పార్లమెంట్ నూతన భవనం ప్రతి ఒక్క భారతీయుడు గర్వపడేలా చేస్తుంది. పార్లమెంట్ కొత్త భవనంలోని ఈ అద్భుతమైన విశేషాలను చూసి యావత్ దేశం సంతోషిస్తోంది. మన దేశ సంస్కృతి, ఆధునికత కలబోతకు ఇదొక నిదర్శనం. ఈ వీడియోని మీదైన అభిప్రాయాలతో షేర్ చేయాలని అభ్యర్థిస్తున్నాను. అది మీ ఆలోచనలు తెలిసేలా ఉండాలి. అటువంటి వాటిల్లో కొన్నింటిని నేను రీట్వీట్ చేస్తాను’’ అని ట్వీట్ చేశారు.


More Telugu News