‘ది కేరళ స్టోరీ’ డైరెక్టర్ కు అస్వస్థత.. ఆసుపత్రిలో చికిత్స!
- మూవీ ప్రమోషన్ల కోసం తిరుగుతుండటంతో అనారోగ్యానికి గురైన సుదీప్తో సేన్
- ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు
- అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడి
- హెల్త్ బాగుందనీ, ఈ రోజే డిశ్చార్జ్ కావచ్చన్న సుదీప్తో
‘ది కేరళ స్టోరీ’ సినిమా దర్శకుడు సుదీప్తో సేన్ అస్వస్థతకు గురయ్యారు. కొన్ని రోజులుగా మూవీ ప్రమోషన్స్, సక్సెస్ మీట్ల కోసం తిరుగుతుండటంతో ఆయన ఆరోగ్యం దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సుదీప్తో సేన్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించామని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు.
తన ఆరోగ్యంపై సుదీప్తో సేన్ కూడా క్లారిటీ ఇచ్చారు. శనివారం ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ‘‘డీహైడ్రేషన్, ఇన్ఫెక్షన్ సమస్యలతో కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరాను. ఇప్పుడంతా కంట్రోల్ లోనే ఉంది. నేను ఈ రోజే డిశ్చార్జ్ కావచ్చు. నన్ను ఇంటికి పంపించాలని డాక్టర్లను అడుగుతాను’’ అని చెప్పారు.
ఇక ‘ది కేరళ స్టోరీ’ సినిమాలో అదా శర్మ, యోగితా బిలానీ, సోనియా, సిద్ది ఇధ్నాని ప్రధాన పాత్రల్లో నటించారు. కేరళ రాష్ట్రంలో అమ్మాయిలను బలవంతంగా మతం మార్పించి.. వారిని తీవ్రవాదులుగా ఎలా మార్చారు అనే ఇతివృత్తంతో సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. కలక్షన్స్ కూడా బాగానే రాబట్టింది. ఇప్పటివరకు 200 కోట్లకుపైగా వసూళ్లు సాధించినట్లు సమాచారం.