హైదరాబాద్‌లో అత్యాధునిక పెలికాన్ ట్రాఫిక్ సిగ్నల్స్.. ప్రజల్లో కొరవడిన అవగాహన!
- ట్రాఫిక్ కూడళ్ల వద్ద పాదచారులు బటన్ నొక్కగానే రెడ్ లైట్ పడేలా సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటు
- మూడు కమిషనరేట్ల పరిధిలోని పలు కూడళ్లల్లో పెలికాన్ సిగ్నల్స్
- సిగ్నల్స్ పడుతున్నా వాహనదారులు అగని వైనం
- గతంలో కంటే పరిస్థితి మెరుగైందంటున్న పాదచారులు
- ప్రజల్లో అవగాహన పెంచేందుకు వలంటీర్ల కృషి
హైదరాబాద్ నగరంలో అత్యాధునిక పెలికాన్ ట్రాఫిక్ సిగ్నల్స్ అందుబాటులోకి వచ్చినా ప్రజల్లో వాటి ఉపయోగాలపై అవగాహన కొరవడింది. మొత్తం మూడు కమిషనరేట్ల పరిధిలో ప్రస్తుతం పలు కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ అందుబాటులో ఉన్నాయి. రద్దీ ట్రాఫిక్‌లో పాదచారులు సులభంగా రోడ్డు దాటేందుకు వీటిని ప్రవేశపెట్టారు. ట్రాఫిక్ కూడలి వద్ద ఉన్న బటన్ నొక్కగానే 15 సెకన్ల లోపు రెడ్ లైట్ పడుతుంది. దీంతో, పాదచారులు సులభంగా రోడ్డు దాటొచ్చు.
అయితే, ఈ వ్యవస్థపై అవగాహన లేకపోవడంతో వాహనదారులు ఈ రెడ్ లైట్స్‌ను లెక్క చేయడంలేదని పలువురు వాపోయారు. గతంలో కంటే పరిస్థితి కొంత మెరుగైనప్పటికీ ప్రజల్లో అవగాహన మరింత పెరగాలని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కొన్ని చోట్ల పెలికాన్ సిగ్నళ్లపై అవగాహన పెంచేందుకు వలంటీర్లు కృషి చేస్తున్నారు. ఈ వ్యవస్థ ద్వారా రెడ్ సిగ్నల్ పడినా ట్రాఫిక్ ఆగని సందర్భాల్లో వలంటీర్లు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్నారు. ఈ సిగ్నల్స్‌పై అవగాహన పెంచుకుని నిబంధనలను పాటిస్తే తమ ఇబ్బందులు తొలగిపోతాయని పాదచారులు చెబుతున్నారు.