టీడీపీ మహానాడు ఇప్పటి వరకు ఎప్పుడెప్పుడు, ఎక్కడెక్కడ జరిగిందంటే..?

  • 1982లో తొలి మహానాడు హైదరాబాద్ లో
  • రెండవ, మూడవ మహానాడులు విజయవాడ, విశాఖల్లో
  • మధ్యలో తొమ్మిదేళ్ల పాటు జరగని మహానాడు
తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడు కాసేపట్లో రాజమండ్రిలో ప్రారంభం కానుంది. పార్టీ అధినేత చంద్రబాబు ఈ వేడుకను ప్రారంభించనున్నారు. ఈరోజు, రేపు రెండు రోజుల పాటు ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనుంది. ఇప్పటి వరకు మహానాడు వేడుకలు ఎప్పుడెప్పుడు, ఎక్కడెక్కడ జరిగాయో చూద్దాం. 

మహానాడు వేడుకల వివరాలు:
  • 1982 - తొలి మహానాడు. ఆవిర్భావ సంవత్సరంలో హైదరాబాద్ లో జరిగింది. 
  • 1983 - విజయవాడ
  • 1984 - విశాఖపట్నం
  • 1986, 1987 - హైదరాబాద్
  • 1988 - విజయవాడ
  • 1990 నుంచి 1994 మధ్య కాలంలో 4 మహానాడులు - హైదరాబాద్
  • 1998, 1999 - హైదరాబాద్
  • 2000 - విజయవాడ
  • 2001 - విశాఖపట్నం
  • 2022 - వరంగల్
  • 2003 - తిరుపతి
  • 2004, 2005 - హైదరాబాద్
  • 2006 - రాజమండ్రి
  • 2007 - తిరుపతి
  • 2009 నుంచి 2015 వరకు - హైదరాబాద్
  • 2016 - తిరుపతి
  • 2017 - విశాఖపట్నం
  • 2018 - విజయవాడ
  • 2020, 2021 - కరోనా కారణంగా ఆన్ లైన్ లో మహానాడు నిర్వహణ
  • 2022 - ఒంగోలు
  • ప్రస్తుతం 2023 - రాజమండ్రి

పార్టీ ఆవిర్భావం నుంచి మధ్యమధ్యలో తొమ్మిదేళ్ల పాటు మహానాడును నిర్వహించలేదు.


More Telugu News