నేడు టీడీపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక.. పది గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ

  • ప్రతి రెండేళ్లకు ఒకసారి టీడీపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక
  • కరోనా కారణంగా ఈసారి ఆలస్యం
  • అవసరమైతే సాయంత్రం 4 గంటల నుంచి ఓటింగ్
  • సాయంత్రం ఏడు గంటలకు అధ్యక్షుడి పేరు ప్రకటన
  • చంద్రబాబు ఎన్నిక లాంఛనమేనంటున్న నేతలు
నేడు టీడీపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక జరగనుంది. ఉదయం 10 గంటల నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఒంటి గంట నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను పరిశీలిస్తారు. అనంతరం గంటపాటు అంటే సాయంత్రం నాలుగు గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతుంది. అవసరమైతే సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు ఓటింగ్ జరుగుతుంది. రాత్రి ఏడు గంటలకు ఎన్నికైన జాతీయ అధ్యక్షుడి పేరును ఎన్నికల కమిటీ ప్రకటిస్తుంది. అయితే, చంద్రబాబు ఎన్నిక లాంఛనమేనని టీడీపీ నేతలు చెబుతున్నారు. 

నిజానికి ప్రతి రెండేళ్లకు ఒకసారి అధ్యక్షుడిని ఎన్నుకోవడం ఆనవాయితీ కాగా, కరోనా కారణంగా ఈసారి జాప్యం జరిగింది. ఈ ఎన్నిక కోసం కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ఆధ్వర్యంలో ఎన్నికల కమిటీని పొలిట్ బ్యూరో నియమించింది. ఇందులో పార్టీ నాయకులు అశోక్ గజపతిరాజు, కాలువ శ్రీనివాసులు,  నక్కా ఆనందబాబు,  రావుల చంద్రశేఖర్ రెడ్డి, గుమ్మడి సంధ్యారాణి, ఫరూక్ తదితరులు పర్యవేక్షకులుగా ఉంటారు.


More Telugu News