మాస్టర్ ప్లాన్ ప్రకారం పేదలకు ఇళ్లు ఇస్తే ఎవరికీ ఇబ్బంది లేదు: నారా లోకేశ్

  • చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం
  • హాజరైన నారా లోకేశ్
  • ఆమోదయోగ్యం కాని చోట ఆర్-5 జోన్ ఏర్పాటు చేశారని విమర్శలు
  • పేదలకు ఆశ్రయం, ఉపాధి రెండూ ఉండని చోట స్థలాలు ఏంటన్న లోకేశ్
టీడీపీ మహానాడు కోసం పార్టీ అగ్రనేతలు రాజమండ్రి చేరుకుంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన పొలిట్ బ్యూరో సమావేశంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో నారా లోకేశ్ కూడా పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇవాళ ఏపీ సర్కారు అమరావతి ఆర్-5 జోన్ లో ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడంపై స్పందించారు. 

అమరావతి మాస్టర్ ప్లాన్ ప్రకారం పేదలకు ఇళ్లు పంపిణీ చేస్తే ఎవరికీ అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. కానీ సీఎం జగన్ వైఖరి చూస్తే అలాంటి మంచి ఉద్దేశం ఉన్నట్టు కనిపించడంలేదని విమర్శించారు. ఆర్-5 జోన్ ఏర్పాటు చేసిన చోట ఆశ్రయం, ఉపాధి రెండూ కష్టమేనని, అలాంటి ప్రాంతంలో నివాసం ఏర్పాటు చేసుకుని పేదలు ఎలా బతకాలని లోకేశ్ ప్రశ్నించారు. 

పేదలను మరింత పేదలుగా మార్చే కుట్రలో భాగంగానే ఆర్-5 జోన్ ను తెరపైకి తీసుకువచ్చారని వ్యాఖ్యానించారు. అనువుగాని చోట ఆర్-5 జోన్ ఏర్పాటు చేయడమే అందుకు నిదర్శనం అని లోకేశ్ విమర్శించారు.


More Telugu News