అనుబంధ కౌంటర్ లో అవినాశ్ పై కీలక విషయాలు ప్రస్తావించిన సీబీఐ
- వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు
- ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన అవినాశ్
- నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ
- అనుబంధ కౌంటర్ దాఖలు చేసిన సీబీఐ
- వివేకా మృతి విషయం జగన్ కు 6.15 గంటలకు ముందే తెలిసినట్టు తేలిందని వెల్లడి
వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో, హైకోర్టులో సీబీఐ అనుబంధ కౌంటర్ దాఖలు చేసింది. ఇందులో అవినాశ్ రెడ్డిపై పలు ఆసక్తికర అంశాలను పొందుపరిచింది.
వివేకా మృతి విషయం జగన్ కు 6.15 గంటలకు ముందే తెలిసినట్టు తేలిందని వెల్లడించింది. కృష్ణారెడ్డి చెప్పకముందే వివేకా మృతి విషయం జగన్ కు తెలుసని పేర్కొంది. వివేకా మృతి గురించి జగన్ కు అవినాశ్ రెడ్డే చెప్పారా అన్నది దర్యాప్తు చేయాల్సి ఉందని సీబీఐ వివరించింది. అవినాశ్ ను కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాల్సి ఉందని స్పష్టం చేసింది.
విచారణకు అవినాశ్ రెడ్డి సహకరించడంలేదని, వివేకా హత్య వెనుక భారీ కుట్రను వెల్లడించేందుకు అవినాశ్ ముందుకు రావడంలేదని సీబీఐ తన కౌంటర్ లో ఆరోపించింది.
"హత్య జరిగిన రాత్రి 12.27 గంటల నుంచి 1.10 గంటల వరకు అవినాశ్ వాట్సాప్ కాల్ మాట్లాడారు. ఈ నెల 15న నోటీసులు ఇస్తే 4 రోజుల సమయం కావాలన్నారు. ఈ నెల 19న నోటీసు ఇస్తే తల్లి అనారోగ్యం వల్ల రాలేనన్నారు. తల్లి అనారోగ్యం పేరుతో ఉద్దేశపూర్వకంగా హైదరాబాద్ విడిచి వెళ్లారు. విచారణకు రావాలని ఫోన్ చేసి కోరినా అవినాశ్ రాలేదు. మళ్లీ ఈ నెల 22న నోటీసులు ఇస్తే తల్లి అనారోగ్యం కారణంగా వారం రోజుల పాటు రానన్నారు.
అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు ఈ నెల 22న మా బృందం కర్నూలు వెళ్లింది. అవినాశ్ రెడ్డి అనుచరులను అక్కడ చూసిన తర్వాత శాంతిభద్రతల సమస్య రావొచ్చని అనిపించింది. జూన్ 30 లోగా వివేకా హత్య కేసు దర్యాప్తు పూర్తి చేయాల్సి ఉంది. అందువల్ల అవినాశ్ రెడ్డికి బెయిల్ ఇవ్వవొద్దు" అంటూ తన కౌంటర్ లో వివరించింది