ఢిల్లీకి బయల్దేరిన సీఎం జగన్.. మూడు రోజులు ఢిల్లీలోనే!
- రేపు నీతి ఆయోగ్ కార్యక్రమంలో పాల్గొననున్న జగన్
- ఎల్లుండి కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవానికి హాజరుకానున్న సీఎం
- పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీకి బయల్దేరారు. విజయవాడలోని గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి ఆయన ప్రత్యేక విమానంలో వెళ్లారు. మూడు రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే బస చేయనున్నారు. రేపు నీతి ఆయోగ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఎల్లుండి నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవ వేడుకకు హాజరవుతారు. తన పర్యటన సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులను కూడా ఆయన కలిసే అవకాశం ఉంది. 28వ తేదీ సాయంత్రం ఆయన మళ్లీ ఏపీకి తిరుగుపయనమవుతారు.
ప్రధాని మోదీ చేతుల మీదుగా కొత్త పార్లమెంటు భవన సముదాయం ప్రారంభోత్సవం జరగనుంది. రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగితేనే తాము వస్తామని చెపుతూ 20 పార్టీలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాయి. ఏపీ నుంచి వైసీపీ, టీడీపీ రెండు పార్టీలు హాజరవుతున్నాయి. టీడీపీ తరపున ఆ పార్టీ ఎంపీలు హాజరవుతారు.