కరాటే కల్యాణి 'మా' సభ్యత్వం రద్దు.. కారణం ఇదే!
- ఖమ్మంలో కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు సన్నాహకాలు
- దేవుడి రూపంలో విగ్రహం పెట్టడంపై కల్యాణి అభ్యంతరం
- కల్యాణికి షోకాజ్ నోటీసులు పంపి.. సభ్యత్వం రద్దు చేసిన 'మా'
టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి పేరు తెచ్చుకున్న కరాటే కల్యాణి తరచుగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా దివంగత ఎన్టీఆర్ విగ్రహం గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమెను ఇరకాటంలోకి నెట్టేశాయి. ఖమ్మంలో ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని శ్రీకృష్ణుడి రూపంలో తయారు చేశారు. దీనిపై కల్యాణి అభ్యంతరం వ్యక్తం చేసింది. హిందువులు పవిత్రంగా పూజించే శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని ఆమె తప్పుపట్టారు. దేని కోసం ఎన్టీఆర్ ను దేవుడిని చేస్తున్నారని ప్రశ్నించారు.
ఈ వ్యాఖ్యలు ఆమెను చిక్కుల్లో పడేశాయి. కల్యాణిపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఆమెకు షోకాజ్ నోటీసు ఇచ్చింది. అయితే, నిర్ణీత గడువులోగా ఆమె వివరణ ఇవ్వక పోవడంతో అసోసియేషన్ నుంచి ఆమె సభ్యత్వాన్ని రద్దు చేశారు.
దీనిపై కల్యాణి ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఏం తప్పు చేశానో అర్థం కావడం లేదని అన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి తాను వ్యతిరేకం కాదని... అయితే, కృష్ణుడి రూపంలో విగ్రహం పెట్టడాన్ని మాత్రమే వ్యతిరేకించానని చెప్పారు. ప్రతి హీరోకి దేవుడి రూపంలో విగ్రహాలు పెడితే ఇక దేవుళ్లు ఎందుకని ప్రశ్నించారు. అనారోగ్యం కారణంగా నోటీసుల పట్ల స్పందించలేకపోయానని... ఇంతలోనే తనను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారని ఆవేదన వ్యక్తం చేశారు. 23 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న తనకు మంచి గిఫ్ట్ ఇచ్చారని వ్యాఖ్యానించారు. తన సభ్యత్వాన్ని రద్దు చేసినా తాను ఇండస్ట్రీని వదిలి వెళ్లనని... ఇక్కడే ఉంటానని చెప్పారు. ఎవరో తనపై కుట్ర చేశారని ఆరోపించారు.
ఈ వ్యాఖ్యలు ఆమెను చిక్కుల్లో పడేశాయి. కల్యాణిపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఆమెకు షోకాజ్ నోటీసు ఇచ్చింది. అయితే, నిర్ణీత గడువులోగా ఆమె వివరణ ఇవ్వక పోవడంతో అసోసియేషన్ నుంచి ఆమె సభ్యత్వాన్ని రద్దు చేశారు.