తిరుపతిలో వర్షం, ఈదురుగాలుల బీభత్సం

  • ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో వర్షాలు
  • తిరుపతిలో విరిగిపడిన చెట్లు
  • నిలిచిన విద్యుత్ సరఫరా
  • రోడ్లపైకి వర్షపు నీరు
ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఈ సాయంత్రం తిరుపతిలో వర్షం, ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. నగరంలో పలు చోట్ల చెట్లు నేలకూలాయి. టీటీడీ పరిపాలనా భవనం, లీలా మహల్ జంక్షన్ వద్ద చెట్లు విరిగిపడ్డాయి. వర్షం, ఈదురుగాలుల కారణంగా తిరుపతిలో పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బస్టాండ్ లోనూ నీరు ప్రవేశించడంతో ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. చాలాచోట్ల రోడ్లపై వర్షపు నీరు ప్రవహిస్తుండడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

అటు ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం బొద్దుకూరపాడులో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో 12 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. బాపట్ల మండలం చినగంజాంలోనూ ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది.


More Telugu News