పోలీసుల థర్డ్ డిగ్రీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు

  • గువాహటిలో ఫోరెన్సిక్ సైన్సెస్ వర్సిటీ ఏర్పాటు
  • శంకుస్థాపన చేసిన అమిత్ షా
  • ఇది థర్డ్ డిగ్రీ ప్రయోగించే కాలం కాదని వ్యాఖ్య 
  • ప్రత్యామ్నాయాలు వినియోగించుకోవాలని సూచన
నేరస్తుల నుంచి నిజాలను రాబట్టేందుకు పోలీసులు పలు విధానాలను ఉపయోగిస్తారన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, పోలీసుల థర్డ్ డిగ్రీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది థర్డ్ డిగ్రీ ప్రయోగించే కాలం కాదని స్పష్టం చేశారు. అలాంటివి ఎక్కడా ఉపయోగించకూడదన్నారు. ప్రత్యామ్నాయంగా ఫోరెన్సిక్ విభాగాలను వినియోగించుకోవాలని పోలీసులకు సూచించారు. 

అసోంలోని గువాహటిలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీకి అమిత్ షా నేడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన పై వ్యాఖ్యలు చేశారు. ఇక, మణిపూర్ అల్లర్లపైనా కేంద్ర హోంమంత్రి స్పందించారు. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.


More Telugu News