డింపుల్ హయతి పట్ల డీసీపీ అసభ్యంగా ప్రవర్తించారంటున్న ఆమె న్యాయవాది

డింపుల్ హయతి పట్ల డీసీపీ అసభ్యంగా ప్రవర్తించారంటున్న ఆమె న్యాయవాది
  • జంతువులను హింసిస్తున్నందుకు డీసీపీని డింపుల్ వారించిందన్న న్యాయవాది 
  • బయటకు వెళ్లేందుకు కూడా డింపుల్ భయపడుతోందని వెల్లడి
  • కేసును చట్టపరంగా ఎదుర్కొంటామని వ్యాఖ్య
సినీ నటి డింపుల్ హయతి, ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డేల మధ్య నెలకొన్న వివాదం మలుపులు తిరుగుతోంది. తాజాగా డింపుల్ తరపు న్యాయవాది మాట్లాడుతూ, జంతువులను హింసిస్తున్నందుకు డీసీపీని డింపుల్ వారించిందని, దీంతో ఆయన కక్ష పెంచుకున్నారని తెలిపారు. డింపుల్ పట్ల అసభ్యంగా వ్యవహరించారని చెప్పారు. ప్రస్తుత పరిణామాలతో డింపుల్ మానసిక ఒత్తిడికి గురైందని, బయటకు వెళ్లేందుకు కూడా భయపడుతోందని అన్నారు. డీసీపీ నుంచి డింపుల్ కు ప్రమాదం ఉందని చెప్పారు. కేసును తాము చట్టపరంగానే ఎదుర్కొంటామని తెలిపారు. 

ఈ కేసు గురించి ఇప్పటి వరకు డీసీపీ మాత్రమే మాట్లాడారని, పోలీసులకు ఫిర్యాదు చేసిన డ్రైవర్ ఎందుకు మాట్లాడలేదని సదరు న్యాయవాది ప్రశ్నించారు. డింపుల్ పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీ తనకు అందిందని.... కారు కవర్ తీసినట్టు ఎఫ్ఐఆర్ లో ఉందని చెప్పారు. రోడ్డుపై ఉండాల్సిన కోన్లు, దిమ్మలు అపార్ట్ మెంట్ లోకి ఎందుకు వచ్చాయని ఆయన ప్రశ్నించారు. 


More Telugu News