'టైగర్ నాగేశ్వరరావు' స్ట్రీమింగ్ హక్కులు దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్?
- 'టైగర్ నాగేశ్వరరావు'గా రవితేజ
- స్టూవర్టుపురం గజదొంగ బయోపిక్ ఇది
- రవితేజకి ఫస్టు పాన్ ఇండియా మూవీ
- కథానాయికగా నుపుర్ సనన్ పరిచయం
- అక్టోబర్ 20వ తేదీన సినిమా విడుదల
రవితేజ కథానాయకుడిగా 'టైగర్ నాగేశ్వరరావు' రూపొందుతోంది. అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ సినిమాకి, వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమాతో 'నుపుర్ సనన్' కథానాయికగా పరిచయం కానుంది. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ కి ఈమె చెల్లెలు. ఈ సినిమాకి ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు.
ఈ సినిమా నిర్మాణ దశలో ఉండగానే స్ట్రీమింగ్ హక్కులు అమ్ముడైనట్టుగా చెబుతున్నారు. అమెజాన్ ప్రైమ్ వారు భారీ రేటు చెల్లించి ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకున్నట్టుగా సమాచారం. ఇది ఒక గజదొంగ కథ .. చాలా కాలం క్రితం అటు ప్రభుత్వాన్ని .. ఇటు ప్రజలను నానా తిప్పలు పెట్టిన స్టూవర్టుపురం దొంగ కథ. ఆయన బయోపిక్ నే ఇది .. ఆ పాత్రలోనే రవితేజ కనిపించనున్నాడు.
కెరియర్ పరంగా రవితేజకి ఇది 71వ సినిమా .. ఆయన కెరియర్లో ఫస్టు పాన్ ఇండియా సినిమా. ఇంతవరకూ వదిలిన అప్ డేట్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. రవితేజ ఎనర్జీ లెవెల్స్ ఎంతమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుందని వంశీ అంటున్నాడు. ఈ సినిమాలో కొత్త రవితేజని చూస్తారని చెబుతున్నాడు. అనుపమ్ ఖేర్ .. జిషు సేన్ గుప్తా ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాను, దసరా కానుకగా అక్టోబర్ 20వ తేదీన విడుదల చేయనున్నారు.