కొత్త లోక్‌సభలో రాజదండం.. ప్రతిష్ఠించనున్న మోదీ

  • బ్రిటిషర్ల నుంచి అధికార మార్పిడి సందర్భంగా రాజదండం
  • 14 ఆగస్టు 1947న నెహ్రూకి అందించిన లార్డ్ మౌంట్‌బాటన్
  • 28న సంప్రదాయబద్ధంగా ప్రతిష్ఠాపన
  • హాజరు కానున్న ఉమ్మిడి బంగారుశెట్టి
బ్రిటిషర్ల నుంచి భారతీయులకు జరిగిన అధికార మార్పిడికి గుర్తుగా లార్డ్ మౌంట్‌బాటన్ నుంచి జవహర్‌లాల్ నెహ్రూ అందుకున్న రాజదండం (సెంగోల్)ను నూతన పార్లమెంటులోని లోక్‌సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రతిష్ఠించనున్నారు. ఈ నెల 28న నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించనున్న మోదీ.. తమిళనాడులోని తిరువడుత్తురై అధీనం నుంచి వచ్చే వేదపండితుల ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా రాజదండాన్ని ప్రతిష్ఠిస్తారు.

ఐదడుగులకుపైగా పొడవుతో బంగారు పూత కలిగిన ఈ వెండిదండం పైభాగంలో న్యాయానికి ప్రతీక అయిన నంది చిహ్నం చెక్కారు. గతేడాది వరకు ఇది గుజరాత్‌లోని అలహాబాద్ మ్యూజియంలో ఉండేది. గతేడాది నవంబరు 4న దానిని అక్కడి నుంచి శాశ్వత ప్రాతిపదికన ఢిల్లీ జాతీయ మ్యూజియానికి తరలించారు. కాగా, 14 ఆగస్టు 1947న రాజదండాన్ని బ్రిటిషర్లు నెహ్రూకు అందించిన కార్యక్రమంలో పాల్గొన్న ఉమ్మిడి బంగారు శెట్టి (96) కూడా ప్రతిష్ఠాపక కార్యక్రమంలో పాల్గొంటారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు.


More Telugu News