అవినాశ్ రెడ్డి అరెస్ట్ విషయంలో అందరూ ఓపిక పట్టాల్సిందే: జీవీఎల్ నరసింహారావు

  • సీబీఐ నిర్ణయం తీసుకునేంత వరకు అందరూ ఓపిక పట్టాలన్న జీవీఎల్
  • ఫ్యాక్షనిజం ఒత్తిళ్లకు సీబీఐ లొంగదని వ్యాఖ్య
  • సీబీఐ నిర్ణయం తీసుకుంటే ఎవరినైనా అరెస్ట్ చేస్తుందన్న జీవీఎల్
మాజీ మంత్రి వైఎస్ అవినాశ్ రెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసే అంశానికి సంబంధించి బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు. అరెస్ట్ విషయంలో సీబీఐ నిర్ణయం తీసుకునేంత వరకు అందరూ ఓపిక పట్టాల్సిందేనని ఆయన అన్నారు. అవినాశ్ అరెస్ట్ ఎప్పుడనే అంశంలో ఉత్కంఠ అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఫ్యాక్షనిజం ఒత్తిళ్లకు కేంద్ర దర్యాప్తు సంస్థలు లొంగవని చెప్పారు. సీబీఐ ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే ఎవరినైనా, ఏ స్థాయికి వెళ్లయినా అరెస్ట్ చేస్తుందని తెలిపారు. సీబీఐని ఆపడం ఎవరి తరం కాదని అన్నారు. 

మరోవైపు అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఈరోజు తెలంగాణ హైకోర్టు తీర్పును వెలువరించనుంది. సీబీఐ బృందం కాసేపటి క్రితం హైకోర్టుకు చేరుకుంది. కోర్టు తీర్పు తర్వాత సీబీఐ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇంకోవైపు అవినాశ్ రెడ్డి ప్రస్తుతం తన తల్లితో పాటు ఉన్న కర్నూలులోని ఆసుపత్రి వద్ద ఉత్కంఠ వాతావరణం నెలకొంది. సీబీఐ అధికారలు కూడా కర్నూలుకు చేరుకున్నారు.


More Telugu News