రాహుల్‌కు ప్రజా మద్దతు పెరుగుతోంది.. ప్రధాని అభ్యర్థిగా ప్రకటిద్దామన్న మాణికం ఠాగూర్

  • బీజేపీకి వ్యతిరేకంగా ఒక్కటవుతున్న ప్రతిపక్షాలు
  • రాహుల్‌కు 27 శాతం మంది మద్దతు
  • మాణికం ఠాగూర్ ప్రతిపాదనపై చర్చ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి క్రమంగా ప్రజా మద్దతు పెరుగుతోంది. ఇటీవల ఆయన నిర్వహించిన ‘భారత్ జోడో యాత్ర’కు విశేష స్పందన లభించింది. కర్ణాటకలో కాంగ్రెస్ విజయానికి అది కూడా కారణమైంది. ఆయన యాత్ర సాగిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. గతంతో పోలిస్తే రాహుల్ గాంధీకి ప్రజా మద్దతు పెరిగినట్టు ఓ మీడియా సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది.

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ప్రధాని మంత్రి ఎవరన్న దానిపై నిర్వహించిన సర్వేలో రాహుల్‌కు 27 శాతం మంది మద్దతు పలికారు. 43 శాతం మంది మోదీ వైపు మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ కీలక ప్రతిపాదన చేశారు. పార్టీ తరపున రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రతిపాదించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఒక్కటవుతున్న వేళ మాణికం ఠాగూర్ ప్రతిపాదన ప్రాధాన్యం సంతరించుకుంది.


More Telugu News