అక్కడ గెలిచేది నేనే..ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి వ్యాఖ్య

  • వచ్చే ఎన్నికల్లో తాండూరు నుంచి పోటీ చేసి గెలుస్తానన్న ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి
  • నియోజకవర్గంలో తన కేడర్ చెక్కుచెదరలేదని వ్యాఖ్య
  • ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలో చేరిన వారిని ప్రజలు తిరస్కరిస్తారన్న మాజీ మంత్రి
  • కర్ణాటకలో అదే జరిగిందని, ఇక్కడా అంతే జరుగుతుందని కామెంట్
వచ్చే ఎన్నికల్లో తాండూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుస్తానని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అన్ని సర్వేలూ, ప్రజలు తనకు అనుకూలంగా ఉన్నారని అన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరులో బుధవారం ఆయన మీడియాతో ముచ్చటించారు. ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలో చేరిన వారిని ప్రజలు తిరస్కరిస్తారని తెలిపారు. కర్ణాటకలో అదే జరిగిందని, రాష్ట్రంలోనూ అదే పునరావృతమవుతుందని చెప్పారు. 

‘‘2018 ఎన్నికల్లో ఒక పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు కొందరు మరో పార్టీలో చేరడంపై ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఈ విషయమై పార్టీ అధిష్ఠానం అడిగితే ఇదే చెబుతాను. తాండూరులో నా కేడర్ చెక్కు చెదరలేదు. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలకూ వచ్చినట్టే తాండూరుకూ ఎస్డీఎఫ్ ద్వారా రూ.136 కోట్లు వచ్చాయి. అందులో గొప్పేమీ లేదు. కారు గుర్తు అనుకొని కొందరు ట్రక్కు గుర్తుకు ఓటేయడంతోనే గత ఎన్నికల్లో నేను ఓడిపోయా’’ అని మాజీ మంత్రి చెప్పుకొచ్చారు.

BRS

More Telugu News