లాభాల దిశగా నడుస్తున్న 'బిచ్చగాడు 2'
- ఈ నెల 19వ తేదీన విడుదలైన 'బిచ్చగాడు 2'
- తొలి రోజునే హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా
- తెలుగు రాష్ట్రాల్లో లాభాల బాటలో అడుగులు
- ఇతర భాషల్లో లాభాలకు చేరువలో ఉన్న సినిమా
విజయ్ ఆంటోని హీరోగా 'బిచ్చగాడు 2' సినిమా రూపొందింది. ఈ సినిమాకి ఆయనే దర్శకుడు .. ఆయనే నిర్మాత. గతంలో వచ్చిన 'బిచ్చగాడు' సంచలన విజయాన్ని సాధించడంతో, సహజంగానే ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. ఈ నెల 19వ తేదీన విడుదలైన 'బిచ్చగాడు 2' ఆ అంచనాలను అందుకోగలిగింది.
తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 6.50 కోట్లకు జరిగింది. ఐదు రోజుల్లోనే ఈ సినిమా ఆ టార్గెట్ ను దాటేసి లాభాల బాటలో నడుస్తోంది. ఇక మిగతా భాషల్లో ఈ సినిమా 16 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకోగా, ఐదు రోజుల్లో 12.42 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ఒకటి రెండు రోజుల్లోనే అక్కడ కూడా ఈ సినిమా లాభాల బాటలోకి అడుగుపెట్టనుంది.
ఈ వారం తెలుగు సినిమాల నుంచి 'బిచ్చగాడు 2'కి పోటీ అయితే లేదు. కానీ అనువాద చిత్రంగా వస్తున్న '2018' పై మాత్రం అంచనాలు కనిపిస్తున్నాయి. ట్రైలర్ వదిలిన దగ్గర నుంచి ఈ సినిమాపై అందరిలో ఆసక్తి పెరుగుతూ పోతోంది. ఈ సినిమా 'బిచ్చగాడు 2' వసూళ్లపై ఏమైనా ప్రభావం చూపిస్తుందేమో చూడాలి.