ఓడితే ఇంటికే... ఎలిమినేటర్ లో లక్నోపై టాస్ గెలిచిన ముంబయి
- చెన్నై చెపాక్ స్టేడియంలో ఐపీఎల్ ఎలిమినేటర్
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబయి ఇండియన్స్
- ఎలిమినేటర్ మ్యాచ్ లో గెలిచిన జట్టుకు క్వాలిఫయర్-2 బెర్తు
ఐపీఎల్ లో నేడు ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతోంది. క్వాలిఫయర్-2 బెర్తు కోసం లక్నో సూపర్ జెయింట్స్, ముంబయి ఇండియన్స్ అమీతుమీకి సిద్ధమయ్యాయి. ఈ ఎలిమినేటర్ మ్యాచ్ లో ఓడిన జట్టు ఇంటికి వెళుతుందన్న నేపథ్యంలో, రెండు జట్లు చావోరేవో తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్ కు చెన్నైలోని చెపాక్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది. టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ బ్యాటింగ్ ఎంచుకుంది.
ఈ మ్యాచ్ కోసం ముంబయి ఇండియన్స్ జట్టులో ఒక మార్పు చేసినట్టు కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు. కుమార్ కార్తికేయ స్థానంలో హృతిక్ షోకీన్ జట్టులోకి వచ్చాడని వివరించాడు.
ఐపీఎల్ లీగ్ దశ పాయింట్ల పట్టికలో లక్నో జట్టు 17 పాయింట్లతో మూడో స్థానంలో నిలవగా, ముంబయి జట్టు 16 పాయింట్లతో నాలుగో స్థానం దక్కించుకుంది. ఈ రెండు జట్ల మధ్య ఇవాళ్టి ఎలిమినేటర్ మ్యాచ్ లో గెలిచిన జట్టు మే 26న అహ్మదాబాద్ లో జరిగే క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్ తో తలపడనుంది.