అమరావతిలో ఎవరి భూమిని ఎవరికి పంచుతారు?: జడ శ్రావణ్ కుమార్
- విజయవాడలో మీడియాతో మాట్లాడిన జడ శ్రావణ్ కుమార్
- అమరావతిలో బాధితులకు బాసటగా నిలవడం తమ హక్కు అని వెల్లడి
- ఎల్లుండి జరిగే ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని వ్యతిరేకించాలని పిలుపు
జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు, న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ విజయవాడలో మీడియాతో మాట్లాడారు. అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పొడుస్తూ జగన్ పాలన సాగుతోందని విమర్శించారు. అమరావతిలో బాధితులకు బాసటగా నిలవడం తమ హక్కు అని శ్రావణ్ కుమార్ స్పష్టం చేశారు.
అమరావతిలో ఎవరి భూమిని ఎవరికి పంచుతారు? అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. పేదలపై చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వ స్థలం 5 సెంట్లు ఇవ్వాలని శ్రావణ్ కుమార్ డిమాండ్ చేశారు. రేపు జై భీమ్ భారత్ పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు చేపడతామని వెల్లడించారు.
ఎల్లుండి జరిగే ఇళ్ల పట్టాల కార్యక్రమాన్ని అందరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. కోర్టు నుంచి అనుమతి తీసుకుని దీక్షకు దిగుతానని, పాదయాత్ర చేస్తానని ప్రకటించారు.