రూ. 10 కోట్లతో లాల్ దర్వాజ ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం: తలసాని

  • ఉప్పుగూడలో నాలుగు ఫంక్షన్ హాల్స్ నిర్మాణ పనులను ప్రారంభించిన తలసాని
  • సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ప్రభుత్వం కృషి చేస్తోందని వ్యాఖ్య
  • అన్ని వర్గాలు సంతోషంగా ఉండాలనేదే కేసీఆర్ ఆకాంక్ష అన్న మంత్రి
హైదరాబాద్ చాంద్రాయణగుట్ట నియోజకవర్గ పరిధిలో ఉన్న ఉప్పుగూడలో నాలుగు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్స్ నిర్మాణ పనులను ఈరోజు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. రూ. 5 కోట్ల వ్యయంతో ఈ పనులను చేబట్టారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ... హిందూ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. లాల్ దర్వాజ సింహవాహిని ఆలయాన్ని రూ. 10 కోట్లతో అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అని చెప్పారు. ప్రజల మధ్య విభేదాలు సృష్టించేందుకు యత్నిస్తున్న పార్టీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


More Telugu News