రంజిత అలా చేయడం వల్లనే నా భార్య చనిపోయింది: తండ్రి అశోక్ కుమార్
- తన ముగ్గురు కూతుళ్ల గురించి ప్రస్తావించిన అశోక్ కుమార్
- ఇద్దరు అమ్మాయిలు నిత్యానంద మాయలో పడిపోయారని వ్యాఖ్య
- వాళ్లు తనని పట్టించుకోరని వెల్లడి
- ఆర్ధికంగా తనకి ఇబ్బందులు లేవని స్పష్టీకరణ
రంజిత .. నిత్యానంద స్వామి వ్యవహారం అప్పట్లో ఓ హాట్ టాపిక్. ఈ ఇద్దరి గురించి అనేక కథలు .. కథనాలు వినిపించాయి. తాజా ఇంటర్వ్యూలో రంజిత తండ్రి అశోక్ కుమార్ ఇదే విషయాన్ని గురించి ప్రస్తావించారు. "మాకు ముగ్గురు ఆడపిల్లలు .. నిర్మల .. రంజిత .. జ్యోతి. ముగ్గురూ కూడా బాగా చదువుకున్నారు. మంచి సంబంధాలు చూసి పెళ్లి చేశాను" అన్నారు.
నిర్మల తన భర్తతో కలిసి అమెరికాలో ఉండేది .. రంజితను మేజర్ జర్నల్ కి ఇచ్చాను ... మూడో అమ్మాయిని ముంబైలో ఇచ్చాను. అమెరికాలో ఉన్న రంజిత అక్కయ్య నిత్యానంద భక్తురాలు .. ఆమెతో కలిసి వెళ్లిన దగ్గర నుంచి రంజిత అతని భక్తురాలైంది. అతని భ్రమలో పడిపోయి ఇద్దరూ కూడా భర్తల నుంచి విడిపోయారు. ఈ విషయంలో నిత్యానందతో నాకు గొడవ కూడా జరిగింది" అని చెప్పారు.
"రంజిత .. ఆమె అక్కయ్య వలన మా పరువు పోయింది. ఆ బాధను తట్టుకోలేక నా భార్య చనిపోయింది. రంజితకు తండ్రి అక్కర్లేదు .. అతని డబ్బూ అక్కర్లేదు. ఆ ఇద్దరూ నాకు కాల్ కూడా చేయరు. మొదట్లో కొంత బాధ అనిపించేది .. ఇప్పుడు అలవాటుపడిపోయాను. ఆర్ధికంగా నాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. నా చిన్న కూతురు నన్ను బాగానే చూసుకుంటూ ఉంటుంది" అంటూ చెప్పుకొచ్చారు.